ప్రెగ్నెంట్ గా ఉన్నారా ?అయితే బయటకు వెళ్లవలిసి వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలుతీసుకోండి  !!

స్త్రీల జీవితంలోగర్భవతి  కావడం అనేది మరుపురాని మధురానుభూతి. తల్లి అవ్వడం కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. పుట్ట బోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. అంతటి ప్రాధాన్యం గల ఆ సమయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది బడితే అది ఎలా బడితే  అలా చేయకూడదు.. ప్రతి క్షణం ఆచితూచి అడుగేయవలిసి  ఉంటుంది.

ప్రెగ్నెంట్ గా ఉన్నారా ?అయితే బయటకు వెళ్లవలిసి వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి  !!

ముఖ్యంగా గర్భిణులు బయటకువెళ్లవలిసి వచ్చినప్పుడు తమ దగ్గర కొన్ని వస్తువులను తప్పనిసరిగాఉంచుకోవాలి. ఆరోగ్య విషయం లో కానీ, పరిశుభ్రత  విషయం లో కానీ సమస్యలు రాకుండాచూసుకోవాలి . ముఖ్యంగా ప్రయాణాలు చేసే చేసేటప్పుడు మీ బ్యాగ్‌లో వీటిని ఉండేలా చూసుకుంటే మీ ఆరోగ్యం,మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది.

గర్భిణులు బయటకు వెళ్లవలిసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మంచి నీటి ని తమ వెంటతీసుకువెళ్లాలి. నీళ్లు బాగా తాగడం వలన తల్లితో పాటు కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.గర్భిణీ గా ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి నీళ్లతో పాటు బాదంపప్పు లు, దానిమ్మ గింజలు, పండ్ల ముక్కలు లాంటి వాటిని వెంటతీసుకువెళ్లే లా చూసుకోవాలి. గర్భవతి గా ఉన్న సమయంలో  చాలామంది మహిళ లు వెన్నునొప్పితో బాధపడుతుంటారు. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు మీ వెంట హీటింగ్‌ ప్యాడ్‌ను తీసుకువెళ్లడం మంచిది .

గర్భిణీ  స్త్రీలు  బయటికి వెళ్లవలిసి వచ్చినప్పుడు  యాంటాసిడ్‌ టాబ్లెట్లను  తప్పనిసరిగా తీసుకెళ్లాలి. బయటకు వెళ్లినప్పుడు ఎక్కువగా  టాయిలెట్‌ సమస్య ఎదురవు తుంటుంది. బయటి వాష్‌రూమ్స్‌ శుభ్రంగా ఉంటాయో లేదో అన్న భయంతో చాలామంది తమ అవసరాలను వాయిదా వేసుకుంటారు . ఇలా చేయడం మంచిది కాదు. అందుకే గర్భిణులు బయటకు వెళ్లినపుడల్లా టాయిలెట్‌ సీట్‌ శానిటైజర్‌ స్ప్రే  ను వెంట తీసుకువెళ్లాలి. ఈ స్ప్రేని ఉపయోగించడం వల్ల తల్లీ బిడ్డలు ఇన్ఫెక్షన్ల బారినా పడకుండా  సురక్షితం గా ఉంటారు.