రక్త దానం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యం గా ఉన్న వారు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రావు. దీని వల్ల ఎదుటివారికే కాదు.. మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్ స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అసలు ఎందుకు రక్త దానం చేయాలో తెలుసుకుందాం.
రక్త దానం చేయటానికి ప్రధాన కారణం రక్తానికి మరొక ప్రత్యామ్నాయం లేకపోవడం. భారత దేశంలో ప్రతి 3 సెకండ్లకు ఒకరికి రక్త మార్పిడి అవసరం వస్తుంది . మనం ఒక్కసారి రక్తం ఇస్తే అది ముగ్గురి కి ఉపయోగ పడుతుంది. అది ఎలా అంటారా …
మనం దానం చేసిన రక్తాన్ని 3 రూపాల్లో విభజిస్తారు. రెడ్ సెల్స్, ప్లాస్మా మరియు ప్లేట్లెట్స్ ఈ మూడు రకాలని ముగ్గురికి వారి వారి అవసరాలను బట్టి అందిస్తారు. రక్త దానం చేసేదాతకి తమ సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం దొరుకుతుంది .. రక్త దానం చేసేవారి లో గుండె కు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే తరచూ రక్త దానం చేయడం వల్ల శరీరం లో ఉత్పత్తి అయ్యే ఇనుము శాతం పూర్తిగా నియంత్రణ లో ఉంటుంది. రక్త దానం కేన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రక్త దానం చేసే వారికి తమ శరీరానికి సంబంధించిన అనేక రకాలైన రక్త పరీక్ష లను ,పూర్తిగా ఉచితం గా వేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల రక్త దానం చేసే వారు తమను తాము ఆరోగ్యవంతులు గా ఉంచుకోవడానికి,ఏదైనా సమస్య ఉంటె , అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది.
రక్త దానం చేయడం వల్ల మన శరీరములోని కేలరీలు ఖర్చు అవుతాయి. దింతో బరువు పెరిగే ప్రమాదం నుంచి మనం తప్పించుకో వచ్చు. రక్త దానం చేసే ముందు, ఈ అంశాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి.
మీరు 18 నుంచి 65 సంవత్సరముల వయసు మధ్య లో ఉండాలి. కనీసం 50 కిలోల బరువు ఉండాలి.
మెడికల్ హిస్టరీ, మీరు ఆ సమయంలో ఏమైనా మందులు తీసుకుంటే వాటి గురించి వివరంగా చెప్పాలి.
మీరు హోల్ బ్లడ్ డొ నేట్ చేస్తే, మళ్ళీ అలా చేయడానికి కనీసం ఎనిమిది వారాలు ఆగాలి. డబుల్ రెడ్ సెల్ డొనేషన్ అయితే పదహారు వారాలు ఆగాలి. ప్రతి ఏడు రోజుల తర్వాత ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు.
బ్లడ్ డొనేట్ చేయబోయేముందు చేయాల్సిన పనులు
మీ అపాయింట్‌మెంట్‌కి ముందు నీరు ఎక్కువగా తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం.