ట్రెండింగ్ హెల్త్

Butter Milk: మజ్జిగను వీళ్ళు తాగకూడదు.. ఎందుకంటే..!?

Share

Butter Milk: వేసవిలో దప్పిక ఎక్కువగా ఉంటుంది .. దాంతో చల్లచల్లగా ఏమైనా తాగాలని అందరికీ ఉంటుంది.. కూల్ డ్రింక్స్, నిమ్మరసం, షర్బత్ ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు తాగుతూ ఉంటారు.. వేసవి దాహార్తిని తగ్గించడంలో పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది. పెరుగుతో పోల్చుకుంటే మజ్జిగలో బోలెడు పోషకాలు ఉన్నాయి. మజ్జిగ లోనే ప్రోబాయోటిక్ లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది..! మజ్జిగ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సంరక్షిస్తుంది.. ఇన్ని ప్రయోజనాలున్న మజ్జిగను ఈ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అసలు తాగకూడదు.. వాళ్ళేవరంటే..

Suffering from these health problems don't drink Butter Milk:
Suffering from these health problems don’t drink Butter Milk:

కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, కండరాల నొప్పులతో బాధపడుతున్న వారు మజ్జిగను తీసుకోకూడదు. ఒకవేళ ఈ సమస్యలతో బాధపడుతున్నవారు మజ్జిగను తీసుకుంటే సమస్య ఇంకా తీవ్రమవుతుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కూడా మజ్జిగను తాగకూడదు. మజ్జిగ లో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. అందువలన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు మజ్జిగ తాగితే కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అందుకే గుండె జబ్బులతో బాధపడుతున్నవారు మజ్జిగను తీసుకోకూడదు.

Suffering from these health problems don't drink Butter Milk:
Suffering from these health problems don’t drink Butter Milk:

దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్న వారు కూడా మజ్జిగను తీసుకోకూడదు. మజ్జిగ తీసుకుంటే శరీరంలో కఫం ఇంకా పెరుగుతుంది. దాంతో జలుబు ఓ పట్టాన తగ్గదు. మూత్రపిండాలు సమస్యలు ఉన్నవారు కూడా మజ్జిగ తాగకూడదు. తామర సమస్య ఉన్నవారు మజ్జిగ ను అవాయిడ్ చేయడం మంచిది. ముఖానికి మజ్జిగ రాసుకుంటూ ఉంటారు చాలా మంది.. అలా రాసుకుంటే చర్మంపై దురద, మంట వచ్చే అవకాశం ఉంది. మజ్జిగను ఈ సమస్యలు ఉన్నవారు తీసుకోకపోవడమే ఉత్తమం.


Share

Related posts

చాకోలేట్ దేవుడు.. చాక్లేట్లంటేనే ఆ దేవుడికి ఇష్టం.. ఇంతకీ ఆయన ఏ దేవుడంటే?

Varun G

IAS Divya Devarajan: కలెక్టర్ పేరునే ఊరికి పెట్టుకున్న గ్రామస్థులు.. అంతగా ఆమె ఏం చేశారు..!?

bharani jella

Devatha Serial: సంక్రాంతి సంబరాల్లో ఇంట్లో వాళ్ళందరూ ఉంటే.. ఆదిత్య – దేవి ఏం చేస్తున్నారంటే..!?

bharani jella