Pains: ఎన్ని మందులు వాడినా ఈ మోకాళ్ల నొప్పి, ఆర్థరైటిస్ సమస్య కి పరిష్కారం దొరకదు. మందులతో అప్పటికప్పుడు నొప్పి తగ్గినట్టు ఉన్న,ఆర్థరైటిస్ ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న ఉంటుంది. అయితే ఈ ఇంగ్లీష్ మందుల కంటే..ఇంట్లో తయారు చేసే ఒక ప్రత్యేకమైన ఔషదం ఆర్థరైటిస్,మోకాళ్ల నొప్పిని, తగ్గిస్తుంది. ఆ పానీయం ఎలా చేసుకోవాలో చూద్దాం.
ఇంట్లో వంట లో జీలకర్ర ,మిరియాలు, అల్లం, వాడుతూనే ఉంటాము..వీటిలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా రోగాలను తగ్గించుకోవడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. వీటిలో ఉండే ఔషధ గుణాలు, మోకాళ్లు, ఆర్థరైటిస్ సమస్యలు తగ్గిస్తాయి. మిరియాలు, అల్లం, బార్లీ గింజలు, జీలకర్ర తో తయారు చేసిన ప్రత్యేక ఔషధం తాగితే మాత్రం క్రమంగా మోకాళ్ళ నొప్పుల తో పాటు ఆర్థరైటిస్ కూడా తగ్గిపోతాయి. ఈ పానీయం తయారు చేయడానికి ముందు మూడు టీస్పూన్ల జీలకర్ర, నాలుగు టేబుల్ స్పూన్లు మిరియాలు, మూడు టీస్పూన్ల బార్లీ, తో పాటు కొద్దిగా అల్లం తీసుకుని, వాటిని కాసేపు పొయ్యిమీద వేడి చేసి , చల్లార్చి మిక్సీలో పౌడర్లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని మరిగించాలి … నీరు మరుగుతుండగా నే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆ పౌడర్ వేసి, బాగా కలియ తిప్పి ఇంకా కొంచెం సేపు మరిగించాలి. ఆ తర్వాత వడబోసి గోరువెచ్చగా అయిన తర్వాత తాగితే..వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుండి విముక్తి కలుగుతుంది.
ఈ పానీయం మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక్క పూట తాగి ఫలితం కోసం ఎదురు చూడకుండా..సమస్య తగ్గే వరకు ఇది తాగుతూ ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది.మీకు బాగుంది అని అనిపిస్తే మీ వాళ్ళందరికీ చెప్పండి..వారి ఆరోగ్యాన్ని కాపాడండి.