NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Norovirus: నోరో వైరస్ అంటే ఏమిటి.!? ఇది ఎలా వ్యాపిస్తుంది.!? కేరళలో నోరో వైరస్ వ్యాప్తి గురించి కంగారుపడాలా.!?

What is Norovirus? How Does it Spread? Should You Worry About the Norovirus Outbreak In Kerala?

Norovirus: నోరో వైరస్ కేరళలో ఈ కొత్త వైరస్ కలకలం రేపుతోంది.. వాయి నాట్ జిల్లాలో నోరో వైరస్ కేసులు నిర్ధారణయ్యాయి.. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణ జార్జ్ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. వైత్తిరి సమీపంలోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు గత వారం ఈ వైరస్ బారిన పడినట్లు వివరించారు. జంతువుల ద్వారా సంక్రమించే నోరో వైరస్ కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని మంత్రి తెలియజేశారు.. వ్యాధి నియంత్రణకు మార్గదర్శకాలను చెప్పారు.. ఇంతకీ నోరో వైరస్ అంటే ఏమిటి.!? ఇది ఎలా వ్యాపిస్తుంది.!? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.!

What is Norovirus? How Does it Spread? Should You Worry About the Norovirus Outbreak In Kerala?
What is Norovirus How Does it Spread Should You Worry About the Norovirus Outbreak In Kerala

సాధారణంగా నోరోవైరస్‌ ను ఫుడ్ పాయిజనింగ్ లేదా స్టమక్ బగ్ అని పిలుస్తారు. ఇది కడుపు, ప్రేగుల వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల తర్వాత విపరీతమైన కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి 1-3 రోజులు ఉంటుంది. చాలామంది ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండానే కోలు కొంటారు. అయితే చిన్న పిల్లలు, పెద్దలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. వాస్తవానికి దీనిని నార్వాక్ వైరస్ అని పిలుస్తారు. దీనికి ఒహియోలోని పట్టణం పేరు పెట్టారు. ఇది 1972లో మొదటిసారిగా వ్యాప్తి చెందింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం నోరోవైరస్ లు ప్రతి సంవత్సరం యూఎస్ లో కనీసం 21 మిలియన్ల మందికి తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణం అవుతుంది. 4,50,000 కంటే ఎక్కువ మంది ఎమర్జెన్సీ వార్డుల్లో చేరుతారు.

నోరోవైరస్ లక్షణాలు:
వికారం
వాంతులు
నిర్జలీకరణం
భరించలేని కడుపు నొప్పి
నీళ్ళ విరోచనాలు
నోటికి రుచి లేకపోవడం
జ్వరం
కండరాల నొప్పి
గొంతు ఎండిపోవడం
గొంతు పొడిబారటం
తల తిరగడం
మైకం

కలుషిత నీరు, ఆహారం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వ్యాధి అంటువ్యాధి సోకకుండా ఉండటానికి ప్రజలు పరిశుభ్రత పాటించడం అవసరం అని తెలిపారు. ఈ వ్యాధి కలుషితమైన ఆహారం, నీరు మరియు ఉపరితలాల ద్వారా సంక్రమిస్తుంది.
వాంతులు మరియు/లేదా విరేచనాలు, తల మరియు శరీర నొప్పులు ఉంటాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్ద ప్రకారం, నోరోవైరస్ అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణమవుతుంది. గత ఏడాది తిరువనంతపురంలోని విజింజంలో ఇదే వైరస్‌కు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

నోరోవైరస్ సోకిన వారు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి.. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్, కాచిన నీటిని నీటిని తాగాలని.. భోజనం తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత సానిటైజర్ చేసుకోవాలి. మీరు ఉపయోగించే నీరు బ్లీచింగ్‌ పౌడర్‌తో క్లోరినేషన్‌ చేయాలని.. ప్రజలు గృహావసరాల కోసం క్లోరినేట్ చేసిన నీటిని ఉపయోగించాలని.. పండ్లు, కూరగాయలు తినడానికి ముందు పూర్తిగా కడగాలి. అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju