మనం ఇంట్లో తయారు చేసుకునే ఆహారం తినడం ద్వారా ఎంతో ఆరోగ్యం లభిస్తుంది. ఎంత మంచి వంటకాన్ని తయారు చేసినా కూడా అందులో తగినంత ఉప్పు ,కారం ఉంటేనే ఆ వంట మరింత రుచిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం వంట చేసేటప్పుడు అందులో ఉప్పు, కారం కాస్త ఎక్కువగా పడితే ఆ వంట రుచే వేరు అవుతుంది. చాలామంది ఇది ఈ పొరపాట్లను తరచు చేస్తూ ఉంటారు. కూరలో ఉప్పు కారం ఎక్కువ అయినప్పుడు ఈ చిట్కాలను పాటించడం ద్వారా కూరలను మనం అనుకున్న రుచికి తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
చాలామంది వంట చేసేటప్పుడు చేసే అతి పెద్ద పొరపాటు ఉప్పు ఎక్కువ వేయడం కూరలో ఉప్పు ఎక్కువగా వేసినప్పుడు మన ఇంట్లో ఉన్న బంగాళదుంప ఒక చిన్న ముక్కను తీసుకొని కూరలో వేసి తక్కువ మంటలో పదినిమిషాల పాటు ఉడికించడం ద్వారా కూరలో ఎక్కువగా ఉన్న ఉప్పు శాతాన్ని ఈ బంగాళదుంప పీల్చుకుంటుంది. మనం చేస్తున్న కూర ఎక్కువ గ్రేవీ గా ఉన్నప్పుడు అందులో కొద్దిగా నీరు పోయడం వల్ల ఉప్పు శాతం తగ్గుతుంది. అంతేకాకుండా ఉప్పు ఎక్కువ అయినప్పుడు కొద్దిగా పెరుగును, లేదా నిమ్మరసం కలపటం వల్ల కూరలో ఉప్పు ను ఇది సరి చేస్తుంది.
మనం చేసే వంటలలో కొద్దిగా ఉప్పు ఎక్కువైనా తినొచ్చు కానీ కారం ఎక్కువ అయితే మాత్రం ఒక్క ముద్ద కూడా దిగదు. అలాంటప్పుడు ఈ చిన్న చిట్కాలను పాటించి కూరలో కారం తగ్గించవచ్చు. కూరలో కారం ఎక్కువ అనిపిస్తే బాగా పండిన టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తక్కువ మంట దగ్గర బాగా ఉడికించడం ద్వారా కూరలో కారం తగ్గుతుంది. నాన్ వెజ్ వంటలలో కారం ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా పెరుగును లేదా నిమ్మరసం కలపటం ద్వారా వాటి పులుపు కి కారం తగ్గుతుంది.ఇలాంటి చిన్న చిట్కాలను పాటించటం ద్వారా మీరు అనుకున్న రుచిని ఆస్వాదిస్తూ సరైన వంటకం తయారు చేసుకోవచ్చు.