ప్రముఖులైన వ్యక్తుల కు రక్షణ కల్పిస్తూ అనునిత్యం వారి పక్కనే ఉండే బాడీగార్డ్స్ ని మనం చాలా సందర్భాలలో చూసేఉంటాము. బాడీ గొర్డ్స్ చేయాల్సిన పని ఏమిటంటే జనం ఎక్కువ ఉన్నచోట తోపులాట నుండి లేదా ఇతర ఇబ్బందుల నుండి సెలబ్రిటీల కు రక్షణ కల్పించడం.
చూసేవాళ్ళకి మాత్రం వాళ్ళు ఏదో స్టైల్ గా యూనిఫాం వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని, తల కూడాతిప్పకుండా అలాగే నిల్చొని ఉంటారు అనిపిస్తుంది. కానీ వాళ్లు అలా ఒకే చోట నిల్చుని ఎన్నో పనులు చేసేస్తూ ఉంటారు. బాడీ గుర్డ్స్ కళ్ళద్దాలు పెట్టుకునేది స్టైల్ కోసం కాదు. మామూలుగా మనం ఎవరినైనా తదేకంగా చూస్తూ ఉంటె వాళ్ళు చేసే పనిని ఆపేసి వెళ్ళిపోతారు. అందుకే బాడీగార్డ్ కళ్ళద్దాలు పెట్టుకుని అందర్నీ గమనిస్తూ ఉంటారు.
ఎవరైనా జనాల్లో కొంచెం అనుమానాస్పదం గా ఉంటే వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు. ఎలాంటి వాతావరణం అయినా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలి కాబట్టి ఎక్కువ ఎండ తగలకుండా, లేదా ఒకవేళ గాలి ఎక్కువగా వస్తూ ఉంటే వాళ్ల కళ్లలో దుమ్ము పడకుండా కూడా కళ్లద్దాలు ఉపయోగ పడతాయి.
ఎందుకంటే ఎండ గాలి వర్షం లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలని, వ్యక్తులని గమనించడానికి బాడీ గార్డ్ కి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కళ్ళద్దాలు పెట్టుకుంటారు. ఒక బాడీగార్డ్ ని ట్రైన్ చేసేటప్పుడు ఏ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి పరిణామాలు ఎదురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అనే వాటితో పాటు కదలకుండా, తల కూడా తిప్పకుండా … కేవలం కంటి చూపుతోనే అందరిని ఎలా గమనించాలి అనేదానిపై కూడా శిక్షణ ఇస్తారట. అంతేకాకుండా మనకు తెలియని ఎన్నో చిన్న చిన్న విషయాలపై కూడా వాళ్లకి ట్రైనింగ్ ఇస్తారట.