NewsOrbit
న్యూస్

అమ్మ బాబోయ్ ! కేసీఆర్ సార్ కి కోపం వచ్చింది !!

కేంద్రంతో పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 kcr sir was angry
kcr sir was angry

గత కొంతకాలంగా కేంద్రంపై రుసరుసలాడుతున కేసీఆర్ శుక్రవారం బహిరంగంగానే తన వైఖరిని బయట పెట్టారు. పార్లమెంటు సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశమై పార్టీ అవలంబించాల్సిన వ్యూహం మీద చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.కేంద్రం తీరుపై సహనం నశించిందని.. ఇక నుంచి రాష్ట్రానికి రావాల్సినవి పోరాడి సాధించుకుందామని కెసిఆర్ పార్టీ ఎంపీలకు ఉద్బోధించారు.

చివరకు రాష్ట్రానికి కేటాయించిన యూరియాను కూడా పూర్తిగా ఇవ్వడం లేదని కెసిఆర్ కృష్ణాజలాల వివాదాన్ని కేంద్రం పరిష్కరించడం లేదని ఈ కారణంగా కృష్ణా బేసిన్లో ఉండే రాష్ట్రాలు అన్ని ఇబ్బందులు పడుతున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు.రాష్ట్రానికి ఇరవై రెండు నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్రం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.జాతీయ రహదారుల విషయంలోనూ కేంద్రం మాట మీద నిలబడటం లేదని,కనీసం మరమ్మతులు కూడా నిధులు ఇవ్వడం లేదని కెసిఆర్ చెప్పారు.

వరంగల్ చేనేత పార్క్ కు ఒక్క రూపాయి కూడా కేంద్రం సాయం చేయలేదని,రాష్ట్రంలో ఎనిమిది ఎయిర్ స్ట్రిప్ లు నిర్మించుకుంటామ౦ టే కేంద్రం అనుమతివ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయాలని కెసిఆర్ ఎంపీలకు డైరెక్షన్ ఇచ్చారు. జిఎస్టి బకాయిలపై సభ వెలుపల కూడా ఆందోళనలు నిర్వహించాలని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని కెసిఆర్ నిర్దేశించారు.

కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యుత్ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలని టిఆర్ఎస్టిఆర్ఎస్ నిర్ణయించింది..పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని కెసిఆర్ సూచనల మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.మొత్తంమీద కెసిఆర్ వైఖరి సమయం మించిపోతోంది ఇక మిగిలింది సమరమే అన్నట్లుగా ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవచ్చునని వారు చెబుతున్నారు

author avatar
Yandamuri

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju