MODI America Tour: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారు..! 24న జోబైడెన్ తో భేటీ..!!

Share

MODI America Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారు అయ్యింది. వచ్చే వారం రెండు రోజుల పాటు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. దాదాపు ఆరు నెలల తరువాత మోడీ వెళుతున్న తొలి విదేశీ పర్యటన ఇది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆతిథ్యంలో జరిగే క్వాడ్ నేతల సదస్సులో మోడీ పాల్గొననున్నారు. దీంతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనూ మోడీ ప్రసంగించనున్నారు. మోడీ ఆమెరికా పర్యటనకు సంబంధించిన విషయాలను కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ నెల 24న వాషింగ్టన్ లో మోడీ, బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిషిడే సుగా మధ్య క్వాడ్ సదస్సు జరుగనుంది. మరుసటి రోజు 25న న్యూయార్క్ వేదికగా ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశం 76వ సెషన్ లో జరిగే జనరల్ డిబేట్ లో ప్రధాన మంత్రి మోడీ పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు.

MODI America Tour:
MODI America Tour:

ఇండో – పసిపిక్ ప్రాంతంలో కీలక సముద్ర మార్గాల పై సరికొత్త వ్యూహాల అభివృద్ధికి, అక్కడ చైనా ప్రాబల్యాన్ని నిలువరించేందుకు 2017లో నవంబర్ ఇండియా, జపాన్, ఆమెరికా, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఈ కూటమిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ ఏడాది మార్చి నెలలో క్వాడ్ నేతల మధ్య తొలి సదస్సు జరిగింది. అయితే కరోనా కారణంగా పై నలుగురు దేశాధినేతలు వర్చువల్ గా సమావేశమయ్యారు. ఆ భేటీలోనే క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ కు శ్రీకారం చుట్టారు. భారత్ కూడా పలు దేశాలకు టీకాలను ఎగుమతి చేసింది. అయితే ఆ తరువాత భారత్ లో కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. రెండవ సమావేశంలో క్వాడ్ దేశాధినేతలు ముఖాముఖి గా సదస్సులో పాల్గొంటున్నారు.

కోవిడ్ ప్రధాన ఎజెండాగా క్వాడ్ సదస్సు జరగనుంది. క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ పై సమీక్ష నిర్వహించడంతో పాటు సైబర్ భద్రత, సముద్ర జలాల భద్రత, మనవతా సహకారం, వాతావరణ మార్పులు, విద్య, సాంకేతిక తదితర అంశాలపై క్వాడ్ నేతలు చర్చించనున్నారు. అదే విధంగా అప్గానిస్థాన్ లో తాలిబన్ల రాజ్యంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తాలిబన్ల పాలనతో ఎదురయ్యే సవాళ్లను చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more:

1.Revanth Reddy: కేసిఆర్ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి..! క్యాడర్ కు హెచ్చరికలు..!!

2.CM KCR: మాజీ మంత్రి మోత్కుపల్లికి కేసిఆర్ సర్కార్ లో కీలక పదవి..? ఇదీ సాక్షం..!!

3.BJP: కర్నాటక బీజేపీలో సంచలనం..! దుమారం లేపుతున్న బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!!


Share

Related posts

Acharya – LaaheLaahe: ఆచార్య విడుదల కాకముందే రికార్డుల మోత..!! లాహే లాహే సాంగ్ కు 60 మిలియన్ల వ్యూస్..!!

bharani jella

Nagarjuna : నాగార్జున పనైపోయిందనుకున్న ప్రతీసారి షాకిస్తున్నాడు..!

GRK

Mamata Banerjee: అప్పుడే స్టార్ట్ చేసేసిన మమతా బెనర్జీ.. టార్గెట్ 2024..!!

sekhar