NewsOrbit
బిగ్ స్టోరీ మీడియా

అజర్‌‌పై సమితి నిషేధం..మన ఛానళ్ల తీరు!

ఐక్యరాజసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో చైనా ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తకపోవడంతో జైష్-ఏ-మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ని ఐక్యరాజసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రధానమంత్రి మోదీ దీనిని “భారీ విజయంగా” అభివర్ణించారు. అలాగే దీని నుండి రాజతకీయ ప్రయోజనాలు సాధించేందుకు బిజెపి శతవిధాల ప్రయత్నించింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు 36 వాహనాలకి నిప్పు పెట్టారు. ఆలాగే లాండ్ మైన్ పేల్చి 15 మంది జవాన్లను, వారి డ్రైవర్ ని హతమార్చారు. కాంగ్రెస్ దీనిని చీకటి రోజుగా అభివర్ణించింది. బిజెపి పాలనలోనే నక్సలైట్ల హింస పెరిగింది అని పేర్కొంది.

మీడియా ఈ కథనాలని ఎలా రిపోర్ట్ చేసింది?

ఆంగ్ల ఛానళ్ళు

ఇండియా టుడే టివి

“జైష్ అధినేతకి ఐక్యరాజసమితి దెబ్బ”, “ఇమ్రాన్ ఇప్పుడు ఎక్కడ దాక్కుంటాడు?”, “ ఇప్పుడు పాకిస్థాన్ ఏ మొహం పెట్టుకుంటుంది?” వంటి ప్రశ్నలతో ఈ పరిణామం వల్ల దక్షిణాసియా మీద ఉండే ప్రభావం గురించి చర్చించింది.

“ఇది కేవలం మొదటి అడుగే” అని ఐక్యరాజసమితిలో భారతదేశ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పిన మాట వాస్తవమని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు సుశాంత్ శరీన్ పేర్కొన్నారు. ఇది పాకిస్థాన్ మీద ఒత్తిడి పెంచింది అని ఆయన అన్నారు.

“భారతదేశ మద్దతుదారులు” అందరికి ఇది శుభదినం అని బిజెపి అధికార ప్రతినిధి షాజియా ఇల్మి అన్నారు. పుల్వామాలో జరిగిన దాడికి తామే కారణం అని జైష్ వారు చెప్పిన సందర్భంలో ఈ ప్రకటన చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నదని అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా చిట్టచివరికి చైనా కూడా ఉగ్రవాద విషయాల మీద పాకిస్థాన్‌కి తన మద్దతు ఉపసంహరించుకుని భారతదేశం పక్కన చేరింది అని అన్నారు.

ఈ నిషేధం జైష్ తీవ్రవాద కార్యకలాపాలకి అవసరమైన ఫండింగ్ మీద దెబ్బ కొడుతుంది అని చెప్పటానికి “ఆర్ధిక మద్దతు మీద ఆంక్షలు” అన్న హెడ్ లైన్స్ కూడా నడిపింది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝా ఈ విషయాన్నీ గడ్చిరోలిలో మావోయిస్టుల దాడితో పోల్చుతూ మాట్లాడారు. “ అతి కిరాతకంగా 15 మంది కమాండోలని నక్సలైట్లు హత్య చేసిన ఈ రోజు మనకి చీకటి రోజు. మనమందరం సిగ్గుతో తలదించుకోవాలి.”  పుల్వామలో చనిపోయిన జవానులనూ, నక్సలైట్ల దాడులో చనిపోయిన వారినీ, ఇతర ఉగ్ర దాడులలో చనిపోయిన వారినీ గుర్తుచేస్తూ “ఈ సంఘటనలు అన్నిటికీ ఎవరైనా బాధ్యత వహిస్తారా?” అని ప్రశ్నించారు.

“ఇటువంటి మరణాల మీద రాజకీయాలు చేయకూడదు” అనే విషయాన్ని ఒప్పుకుంటూనే బిజెపి అదే చేస్తున్నది అని సంజయ్ ఝా విమర్శించారు.

మసూద్ అజర్ మీద నిషేధంతో ఉగ్ర దాడులు ఆగిపోతాయి అనే భ్రమలు పెట్టుకోకూడదు అని ఆయన వాదించారు. “ 2008 ముంబై దాడులు జరిగిన రెండు వారాల లోపలే హఫీజ్ సయీద్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేట్లు చూశాము. కానీ దాని తరువాత కూడా అతను పాకిస్తాన్‌లో ఎన్నికలలో పాల్గొన్నాడు, ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.” అని సంజయ్ ఝా అన్నారు.

ఎన్ డి టివి 24*7

ఎన్ డి టివి ‘ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్’ కార్యక్రమంలో కూడా నక్సల్ దాడి గురించి చర్చించారు.

ఈ దాడి మరొక ఇంటలిజెన్స్ వైఫల్యం అని మాజీ దౌత్యవేత్త కె.సి.సింగ్ పేర్కొన్నారు. నక్సలైట్లు వాహనాలని తగలబెట్టాక అటువంటి పరిస్థితులలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సంఘటన స్థలానికి ఎలా చేరుకోవాలి అనే విషయాలు పోలీసులకి తెలియకపోయాయి అని ఆరోపించారు. గతంలో కూడా “పుల్వామా, ఉరి సంఘటనలు జరిగినప్పుడు ఎవరినీ బాధ్యులని చెయ్యలేదు” అలాగే “ఏ అధికారి మీద కూడా చర్యలు తీసుకోలేదు” అని పేర్కొన్నారు.

ఇది ఒక “బాధాకరమైన సంఘటన”. “గత సంఘటనల నుండి మనం ఏమి నేర్చుకోలేదు” అనే దానికి ఈ సంఘటన నిదర్శనం అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు శేషాద్రి చారి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకోవాలనీ, నిఘా పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలనీ చెప్పారు.

వాహనాలు తగలబెడితే పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తారు కాబట్టి వాహనాలు తగలబెట్టడం ద్వారా పోలీసులని ఉచ్చులోకి లాగారు అని ఆయన పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకోవడానికి హెలికాఫ్టర్లు ఎందుకు వాడలేదు అని ప్రశ్నించారు. ఎన్నికల కారణంగా సి ఆర్ పి ఎఫ్ దగ్గర అందుబాటులో లేవా అని ప్రశ్నించారు.

గత సంఘటనల నుండి ఎటువంటి పాఠాలు నేర్చుకోకపోవటం వలన ప్రభుత్వం జవాబుదారీతనాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది అని కాంగ్రెస్ వారు పేర్కొంటున్నారు అని ఈ కార్యక్రమం వ్యాఖ్యాత నిధి రజ్దాన్ అన్నారు.

“మిగతా దేశాలలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఉన్నత స్థాయి అధికారులు, మంత్రులు రాజీనామా చేస్తారు. శ్రీలంక ఒక ఉదాహరణ. కానీ ఇక్కడ మాత్రం అటువంటిది ఏమి ఉండదు.” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ అన్నారు.

గత ఐదు సంవత్సరాలలో 1080 కి పైగా జరిగిన నక్సలైట్ల దాడులలో ఐదు వేల మందికి పైబడి చనిపోయినా “బిజెపి వారి పాలనలో జవాబుదారీతనం అనేదే లేదు” అని పేర్కొన్నారు.

దేశంలో ఇంకా “ 11 రాష్ట్రాలలో 90 జిల్లాలు” నక్సలైటు ప్రభావితమైన జిల్లాలుగా ఉన్నాయని హెడ్‌లైన్స్‌ చూపిస్తుండగా,  కేంద్ర ప్రభుత్వం ఏమి చెయ్యలేకపోయింది అని ఆయన పేర్కొన్నారు. సుక్మా దాడి తరువాత వెయ్యి కోట్లు కేటాయిస్తామని వాగ్దానం చేశారు. కానీ నిధులు లేకపోవటంతో అత్యాధునిక వాహనాలు కొనుగోలు చెయ్యలేకపోతున్నాము అని స్వయానా హోం శాఖే చెప్పింది. ఇంత జరుగుతుండగా మోదీ వారణాసిలో “నేను అధికారం చేపట్టిననాటినుండి ఎటువంటి పేలుళ్లు చోటుచేసుకోలేదు” అని చెబుతున్నారు అని విమర్శించారు.

టైమ్స్ నౌ 

#మోదీకార్నర్స్ మసూద్, “బలమైన ప్రభుత్వం చేసి చూపిస్తుంది” అన్న వ్యాఖ్యలతో మసూద్ అజర్ మీద విధించిన నిషేధం బిజెపి ప్రభుత్వం ప్రయత్నాల వల్లనే జరిగింది అన్నట్టు ఈ ఛానల్ ప్రసారాలు నడిపింది.

ఇసి-814 విమానం హైజాక్‌కి గురైనప్పుడు బిజెపి ప్రభుత్వం “మసూద్ అజర్‌ని ఎందుకు విడుదల చేసింది” అని అడిగినందుకు కాశ్మీరీ జర్నలిస్ట్ మాజిద్ హైద్రిని “మోదీ అంటే నిలువెల్లా ద్వేషం” ఉన్నవాడిగా టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్ నిందించింది.

“తన విమర్శకులకి మోదీ ఏ విధంగా జవాబు చెప్పాడో” గమనించాలి అని ఆవిడ అన్నారు. గతంలో మోదీని ప్రతిపక్ష నాయకులు విమర్శించిన వీడియోలని చూపించారు. అందులో ఒకటి బలహీనమైన మోదీ జి జిన్‌పింగ్‌కి భయపడుతున్నాడు అని రాహుల్ గాంధి చెప్పిన మాట.

“మోదీని విమర్శించిన వారందరూ, ఆయన విదేశి ప్రయాణాల వివరాలు అడిగినవారు మరి ఇప్పుడు తమ మోకాళ్ళ మీద కూర్చుని ఆయన క్షమాపణ కోరుకుంటారా? ఆయనని ఇప్పటికైనా ప్రశంసిస్తారా?” అని నావికా కుమార్ అడిగింది.

మసూద్ అజర్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం వల్ల ఇన్నాళ్ళుగా మనం చేస్తున్న ప్రయత్నాలకి ఫలితం దక్కినట్టు అయ్యింది. కానీ దీనర్థం మన ఇష్టమొచ్చినట్టు వెళ్లి పాకిస్థాన్ మీద బాంబులు వెయ్యొచ్చు అని కాదు అని సీనియర్ జర్నలిస్ట్ జాన్ దయాల్ అన్నారు.

రిపబ్లిక్ టివి 

#మోదీ క్రషెస్ పాక్ పేరుతో ఈ వ్యవహారం అంతా ఒక మనిషి ప్రయత్నం అన్నట్టు చూపించింది. దానికి తోడుగా “రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ?” అన్న ప్రశ్న.

“ఈ రోజు భారతదేశానికి ఘనమైన విజయం.” అని యాంకర్ అర్నబ్ గోస్వామి అన్నాడు. ప్రతిపక్షం తరుపున వచ్చిన ప్యానలిస్ట్‌ని ఉద్దేశించి “ మీ మొహం చిట్లించారే?” అని అన్నాడు.

కేంద్రం “నకిలీ బాలకోట్ నివేదికలు” చూపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు నిశాంత్ వర్మ ఆరోపించారు.

“ఈ పరిస్థితుల్లో ఏ నాయకుడు ధైర్యం ఇవ్వగలడు? నాయకుడిగా ఉండగలిగే పరికత్వత ఎవరికి ఉంది ఈ పరిస్థితుల్లో?” అని గోస్వామి ప్రశ్నించారు.

తను వినదలుచుకున్న జవాబు చెప్పటానికి సరైన మనిషి తనకి వెంటనే దొరికాడు.

“మనందరికీ కావలసిన నాయకుడు మోదీలో ఉన్నాడు. కానీ ఇక్కడ సమస్య వలస పాలకులు విడిచి వెళ్ళిన అవశేషాలతోనే.” అని వింగ్ కమాండర్(రిటైర్డ్) ప్రఫుల్ బక్షి అన్నాడు. ఆయన అన్నదానికి అర్థం ఏమిటో మరి ఆయన చెప్పాలి.

హిందీ ఛానళ్ళు

ఏబిపి న్యూస్

ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక గాంధీని ఈ ఛానల్ చూపించింది. ప్రియాంక “మొట్టమొదటి ఇంటర్వ్యూ” గా ఈ ఛానల్ చెప్పుకుంటున్న ఈ ఇంటర్వ్యూలో తాను “బిజెపి కి వ్యతిరేకంగా పోరాడుతున్నానని”, “ఇక్కడ చెయ్యలవసిన పని చాలా ఉంది” అని  ఛానల్ విలేఖరికి చెప్పారు.

సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రైతులకి ఇచ్చే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పధకం “ప్రజలకు అవమానకరం” అని ప్రియాంక చెప్పారు. “జనాలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు”, ఈ డబ్బులు వారికి ఏ విధంగానూ ఉపయోగపడవు అని అన్నారు.

ఈ ఎన్నికలలో ముఖ్య విషయాలు ఏమిటి అని అడగగా “పశువులు తమ పంటని నాశనం చేస్తున్నాయనేది ప్రతి గ్రామంలోనూ వినపడుతున్న ఫిర్యాదు’ అని బదులిచ్చారు. “ మహిళలు అభద్రతా భావంలో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు” అని కూడా చెప్పారు.

“శ్రీలంక లో బురఖా ధరించటంపై విధించిన నిషేధంపై భారతదేశంలో జరుగుతున్న రాజకీయాలు” అనే విషయం మీద ఒక చిన్న కార్యక్రమం చేసింది. “ఆ విషయం మీద ఆ రోజంతా సామాజిక మాధ్యమాలలో చర్చ జరిగిందని” అందులో పేర్కొన్నారు.

ఇక్కడ కూడా అటువంటి నిషేధం విధించాలి అని డిమాండ్ చేస్తున్న శివసేన ఆ నిషేధం విధించాక ఇక్కడ ఎటువంటి ఉగ్రదాదులు జరగవు అని మాట ఇవ్వగలదా అని ఒక హెడ్ లైన్ ద్వారా ప్రశ్నిస్తూ అది పనికిరాని డిమాండ్ అని ఈ కార్యక్రమం తేల్చింది.

ఎన్ డి టివి ఇండియా

“బిజెపిని ఓడించటమే తన ధ్యేయమని ప్రియాంక గాంధీ చెబుతున్నారు”, వారణాసిలో తానూ ఎందుకు పోటి చెయ్యట్లేదు అన్నదానికి ప్రియాంక చెప్పిన కారణాలని వివరిస్తూ  “ప్రతి ఎన్నికలో పోటిచేసేది కేవలం గెలవటానికి మాత్రమే కాదు: ప్రియాంక” అన్న హెడ్ లైన్లు ప్రసారం చేసింది ఈ ఛానల్.

“బిజెపిని అధికారంలోకి రాకుండా చెయ్యటమే అన్ని ప్రతిపక్ష పార్టీల ఉద్దేశం.” అని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి  కమల్ నాథ్ చెప్పిన మాటలని కూడా చూపించింది.

జీ న్యూస్

ఐసి- 814 విమానం హైజాక్‌కి గురయ్యినప్పటి నుండి తమ ఛానల్ మసూద్ అజర్‌ని ఏ విధంగా ట్రాక్ చేసుకుంటూ వస్తుందో యాకర్ సుధీర్ చౌధురి మాట్లాడారు. “అతను ఇప్పుడైనా తన ఉగ్రవాద కార్యకలాపాలు ఆపివేస్తాడు అని ఏమి లేదు”. “2008 ముంబై దాడుల తరువాత హఫీజ్ సయీద్ ని కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. అమెరికా తన మీద డెబ్బై కోట్ల పారితోషికం ప్రకటించింది. అయినా ఈనాటికీ చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.” అని సుధీర్ చౌధురి పేర్కొన్నాడు.

“అటువంటి ఉగ్రవాదుల” కోసం ఒక శాశ్వత పరిష్కారం కావాలి అంటూ “అది కేవలం మిస్సైల్ దాడి ద్వారానే లభ్యమవుతుందని” అన్నాడు.

నక్సలైట్లు తాము దాడి చెయ్యటానికి మహారాష్ట్ర దినోత్సవం రోజునే ఎంపిక చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. “వాళ్ళు వాహనాలని తగలబెట్టి సాయుధ బలగాల రాక కోసం ఎదురుచూస్తున్నారు. సాయుధ బలగాలు ప్రైవేటు వాహనాన్ని కిరాయికి తీసుకున్నారు. అయినా కూడా ఈ విషయం వాళ్ళకి తెలిసిపోయింది. బహుశా దారిలో ఆయిల్ కొట్టించడానికి ఆగినప్పుడు తెలుసుకుని ఉంటారు.”

2014 లో 161 జిల్లాలుగా ఉన్న నక్సలైటు ప్రభావిత జిల్లాలు ఈ రోజుకి 90 కి పడిపోయిన విషయాన్ని, అలాగే గత ఐదు సంవత్సరాలలో 1900 మంది నక్సలైట్ల అరెస్టు, 700 మంది నక్సలైట్ల లొంగుబాటు గురించి కూడా ఛానల్ రిపోర్ట్ చేసింది.

ఆజ్ తక్

మసూద్ అజర్ మీద నిషేధం మనకి దౌత్యపరమైన విజయమని ఈ ఛానల్ రిపోర్ట్ చేసింది. “చైనా తలొగ్గింది, అజర్ విషయంలో ఇండియా పైకెగిరింది” అన్న హెడ్ లైన్‌తో చైనా పాకిస్థాన్‌ని ఏ విధంగా  వదిలివేసిందో చర్చించింది.

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ వారి నిషేధిత జాబితాలో పాకిస్థాన్‌ని  చేర్చే పరిస్థితులు దాదాపుగా ఉన్నాయని పేర్కొంది. ఉగ్రవాదానికి ఆర్ధిక మద్దతు, మనీ లాండరింగ్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న అంతర్జాతీయ కృషికి మద్దతుగా నిలవని దేశాలను ఈ టాస్క్‌ఫోర్స్ 2000 సంవత్సరం నుండి నిషేధిత దేశాల జాబితాలో పెట్టుకుంటూ వస్తున్నది.

-గౌరవ్ వివేక్ భట్నాగర్

‘ద వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment