NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

Pondicherry : పాండిచ్చేరిలో రాజకీయ సంక్షోభం : అసలేం జరిగిందంటే?

Pondicherry : దక్షిణాదిన శాసనసభ ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అనుకున్నదాని కంటే ముందుగానే ఇక్కడ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది . సోమవారం పాండిచ్చేరి ముఖ్య మంత్రి నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు. పాండిచ్చేరిలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం దీంతో కుప్పకూలి నట్లయింది. ఇప్పటికే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో మైనారిటీలో పడిన ప్రభుత్వం సోమవారం బలనిరూపణ ఓటింగ్ కు వెళ్లకుండానే సీఎం నారాయణస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ సై కు రాజ్ భవన్ వెళ్లి రాజీనామా అందించారు. ఆదివారం సాయంత్రమె మరో ఇద్దరు కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అందరూ అనుకున్నట్లుగానే సోమవారం పాండిచ్చేరి అసెంబ్లీలో నారాయణ స్వామి బలాన్ని నిరూపించుకునే ఓటింగ్లో పాల్గొనేందుకు కూడా ఇష్టపడలేదు. అసెంబ్లీలో ప్రసంగం అనంతరం శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయిన ఆయన నేరుగా రాజ్భవన్కు వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని అందించారు.

ఓటింగ్ లేదు రాజీనామా మాత్రమే

పాండిచ్చేరిలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మైనారిటీలో పడడంతో విపక్షాలు ప్రభుత్వం మీద విశ్వాస పరీక్ష నూ ప్రతిపాదించాయి. దీంతో సోమవారం పుదుచ్చేరి శాసనసభ ప్రత్యేకంగా దీనికోసమే సమావేశం అయింది. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానంపై సభ్యుల ఓటింగ్ జరగకముందే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అకస్మాత్తుగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో విశ్వాస తీర్మానం వీగిపోయిన ట్లు స్పీకర్ వి.పి. శివ కొలం దు ప్రకటించారు. అక్కడినుంచి సిఎం తన పదవికి రాజీనామా చేసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. తమిళసై కు తన రాజీనామాను ముఖ్యమంత్రి అందజేశారు.

బిజెపి పైనే ప్రధానంగా ఆరోపణలు

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో సీఎం నారాయణస్వామి శాసనసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. తాము ప్రజల మద్దతుతో గెలిచి డీఎంకే మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ గెలిచామని తమకు ప్రజల మద్దతు ఉందని ఆయన చెప్పారు. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షం తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. అలాగే పాండిచ్చేరి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, ప్రభుత్వ కార్యకలాపాలను కిరణ్బేడీ అడ్డుకున్నారంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఇది కేవలం బిజెపి కుట్రగా ఆయన అభివర్ణించే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు ఏం జరుగుతుంది??

అనూహ్యంగా పాండిచ్చేరి రాజకీయాలు మారిపోయాయి. అటు ఇటు ఇటు అటు సంఖ్య తారుమారు అయింది. నిన్న మొన్నటి వరకు 18 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం నడిపిన కాంగ్రెస్ కూటమి బలం సోమవారానికి కేవలం 12 మంది సభ్యులకు పడి పోయింది. ఇక ప్రతిపక్షం ఎన్ ఆర్ కాంగ్రెస్ కూటమి బలం14 గా ఉంది. ఏడు మంది ఎన్ ఆర్ కాంగ్రెస్ సభ్యులు, నలుగురు అన్నాడీఎంకే సభ్యులతోపాటు బిజెపి తరఫున నామినేటెడ్ భాజపా ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి అసెంబ్లీ కు 26 మంది సభ్యులు ఉంటే, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 14 మంది సభ్యుల బలం అవసరం. మరిప్పుడు ఎన్ ఆర్ కాంగ్రెస్ కూటమి భాజపా నామినేటెడ్ సభ్యులతో కలిసి పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేక ఎన్నికలకు వెళ్తుందా అనేది కీలకంగా మారింది. ఈ సమయంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభ ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమ మార్గంగా ఎన్ ఆర్ కాంగ్రెస్ కూటమి కూడా ఆలోచిస్తూ ఉండటం తో పుదుచ్చేరి ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతకు జైల్ అధికారులు షాక్ .. ములాఖత్‌కు అనుమతి నిరాకరణ..! ఎందుకంటే..?

sharma somaraju

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju