21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
జాతీయం న్యూస్

పీఎఫ్ఐ సంస్థలపై కేంద్రం కీలక నిర్ణయం

Share

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిషేదిత ఉగ్రవాద సంస్థలతో లింక్ లు ఉన్నట్లు కేంద్ర నిఘా సంస్థలు గుర్తించిన నేపథ్యంలో పీఎఫ్ఐ తో సహా దానికి అనుబంధంగా ఉన్న ఎనిమిది సంస్థలపై వేటు వేసింది. చట్ట వ్యతిరేక సంస్థలుగా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిపై అయిదేళ్లపాటు నిషేదం విధించింది. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పీఎఫ్ఐ విస్తరించి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఎన్ఐఏ విస్తృత సోదాలు నిర్వహించి దాదాపు 200 మందికిపైగా పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్ఐఏ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసింది. యూఏపీఏ చట్టం కింద ఈ సంస్థపై నిషేదం విధించిన కేంద్రం .. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాగా ఇటీవల పాట్నాలో ప్రధాన మంత్రి మోడీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర చేసినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. దసరా వేడుకల్లోనూ భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచించినట్లుగా కూడా నిఘా సంస్థలు గుర్తించాయి.

PFI

 

స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) పై కేంద్రం నిషేదం విధించిన తర్వాత కేరళలోని నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్, కర్ణాటక లోని ఫోరం ఫర్ డిగ్నిటీ, తమిళనాడులోని మనితా నీతి పసరాయ్ సంస్థలు కలిసి 2007 లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) గా ఆవిర్భవించాయి.
కేంద్రం తాజాగా నిషేదం విధించిన పీఎఫ్ఐ సంస్థలు ఇవే..
రెహాట్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఐఎఫ్)
క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ)
ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఏఐఐసీ)
నేషనల్ కాన్పెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్ ఓ)
నేషనల్ విమెన్స్ ఫ్రంట్ (ఎన్ డబ్ల్యూఎఫ్)
జూనియర్ ఫ్రంట్ (జీఎఫ్)
ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ (ఈఐఎఫ్)
రెహబ్ ఫౌండేషన్ (కేరళ)

ఏడు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ పై ఎన్ఐఏ దాడులు .. వంద మందికిపైగా అరెస్టు..?


Share

Related posts

Prabhas : ప్రభాస్ లేకుండా ఆ సినిమా షూటింగ్ జరుగుతందా..?

GRK

YS Jagan : ఎంత ధైర్యం జ‌గ‌న్‌… మోడీ ముందే అలా చేసేశావు?

sridhar

బిగ్ బాస్ 4 : గంగవ్వ ఊర మాస్ పర్ఫార్మెన్స్..! అక్కడ చీర జారిపోతున్నా చింపేసింది

arun kanna