NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Sputnik V Vaccine: త్వరలో సింగిల్ డోస్ వ్యాక్సిన్..! భారత్ కు గుడ్ న్యూస్..!!

Sputnik V Vaccine: భారత్ లో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత్ లోని రష్యా రాయబారి నికోలాయ్ కుడషేవ్ అన్నారు. ఇప్పటి వరకూ భారత దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ లే అందుబాటులో ఉన్నాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ లు ఇప్పటి వరకూ అందుబాటులో ఉండగా తాజాగా రష్యాకి చెందిన స్పుత్నిక్ – వీ టీకా కూడా మార్కెట్ లోకి వచ్చేసింది. ఇప్పటికే తొలి విడత కింద లక్షన్నర డోసులు ఈ నెల 1వ తేదీన భారత్ కు చేరుకోగా నేడు రెండవ విడతగా మరో 60వేల టీకా డోసులు ప్రత్యేక  విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి.

Sputnik V Vaccine single dose soon in India
Sputnik V Vaccine single dose soon in India

ఈ సందర్భంగా రష్యా రాయబారి నికోలాయ్ కుడషేవ్ మాట్లాడుతూ కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొవడంలో స్పుత్నిక్ వీ  వ్యాక్సిన్ మెరుగ్గా పని చేస్తోందని అన్నారు. కొత్త వైరస్ రకాలపైనా ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరులో ఇరు దేశాల మధ్య దైపాక్షిక సహకారం పటిష్ఠంగా ముందుకు సాగుతోందన్నారు. భారత్ లో వ్యాక్సిన్ తయారీని దశలవారీగా ఏడాదికి 850 మిలియన్ డోసులకు పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

Sputnik V Vaccine single dose soon in India
Sputnik V Vaccine single dose soon in India

భారత్ లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీ, పంపిణీకి హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్ రెడ్డీస్ కు మొదటి విడతగా 1.5 లక్షల డోసుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఈ నెల 1వ తేదీన దిగుమతి అయ్యింది. వాటిని పంపిణీ చేయడానికి హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కసౌలిలో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ ఈ నెల 13న అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో టీకాల పంపిణీ కార్యక్రమానికి డాక్టర్ రెడ్డీస్ శ్రీకారం చుట్టింది. డాక్టర్ రెడ్డీస్ లో కస్టమ్ పార్మా సర్వీసెస్ వ్యాపార విభాగ అధిపతి దీపక్ సప్రా స్పుత్నిక్ వి తొలి డోసు తీసుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju