NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Women Kidnapped: పెట్రోల్ బంక్ సమీపంలో అందరూ చూస్తుండగానే సినీ పక్కీలో యువతి కిడ్నాప్..వీడియో వైరల్

Share

Women Kidnapped: పట్టపగలు అందరూ చూస్తుండగానే 19 ఏళ్ల బాలికను ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి కిడ్నాప్ చేయడం మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లో తీవ్ర సంచలనం అయ్యింది. బస్సు దిగిన ఓ యువతి పెట్రోల్ బంక్ సమీపంలో తన సోదరుడి కోసం వేచి చూస్తుండగా, ఇద్దరు యువకులు బైక్ వచ్చి బలవంతంగా అమెను బైక్ మీద కూర్చోబెట్టుకుని పరారైయ్యారు.

మద్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఈ ఘటన సోమవారం జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా, మరో యువకుడు ముఖానికి క్లాత్ చుట్టుకుని ఉన్నాడు. అక్కడి సమీపంలోని సీసీ టీవీలో ఈ ఘటన రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, కిడ్నాప్ గురైంది బింధ్ జిల్లాకు చెందిన యువతిగా పోలీసులు తెలిపారు. బీఏ చదువుతున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకునేందుకు బింధ్ వెళ్లినట్లు చెప్పారు. సోమవారం బస్సు దిగిన ఆ యువతి సోదరుడి కోసం పెట్రోల్ బంక్ సమీపంలో వేచి ఉండగా ఆమెను కిడ్నాప్ చేసినట్లు తెలిసిందన్నారు. పట్టపగలు ఇటువంటి ఘటన జరగడంపై బాలికల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరస్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.

AP High Court: స్కిల్ కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్


Share

Related posts

TRS MP KK: టీఆర్ఎస్ ఎంపీ కేకే చేసిన పనికి అందరూ షాక్..! కేసిఆర్ ఏమంటారో..?

somaraju sharma

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ వివాదం..! హైకోర్టు తీర్పుపై దేవాదాయ మంత్రి వెల్లంపల్లి స్పందన ఇదీ..!!

somaraju sharma

MAA Elections: బండ్ల గణేష్ వ్యాఖ్యలకు జీవిత రాజశేఖర్ ఇచ్చిన కౌంటర్ ఇదీ..!!

somaraju sharma