దాడి వెనుక కవిత హస్తం!

తనపై జరిగిన దాడి వెనుక నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. పోలింగ్ కు ముందు రోజు తనపై దాడి జరిగిందనీ, తాను హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు వెళుతుండగా మార్గమధ్యంలో దాడి జరిగిందన్నారు. ఇది కేవలం దాడిగా తాను భావించడం లేదనీ, తనపై జరిగిన హత్యాయత్నంగా భావిస్తున్నానని మధుయాష్కి అన్నారు. తనపై హత్యాయత్నానికి పాల్పడినది టీఆర్ఎస్ వాళ్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ హత్యాయత్నం వెనుక కవిత హస్తం ఉందన్నది తన అనుమానమని పేర్కొన్నారు. ఎందుకంటే తనపై దాడి జరిగిన తరువాత కవిత మాజీ ఎమ్మెల్యేకు, కొమ్మిరెడ్డి రాములుకు ఫోన్ చేసినట్లు తన వద్ద కచ్చితమైన సమాచారం ఉందని అందుకే ఈ హత్యాయత్నం వెనుక ఆమె ప్రమేయం ఉందని భావిస్తున్నాననీ చెప్పారు.