న్యూస్ సినిమా

నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసిన ఫేమస్ యాక్టర్..

Share

నాగార్జున అక్కినేని కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గౌరవం ఉంది. సినీ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాదుకు రావటానికి అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కూడా ఉంది. నాగేశ్వరరావు తర్వాత నాగార్జున కూడా సినిమాల్లో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుని తన తండ్రి గౌరవాన్ని నిలబెడుతున్నాడు. ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావులానే తర్వాతి కాలంలో ఇండస్ట్రీని నాగార్జున, చిరంజీవి ఒంటి చేత్తో ఏలారు. సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులకు ఎటువంటి సమస్య వచ్చినా వీరిద్దరూ ముందుండి ఆ సమస్యలను పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 ఆ ఆర్టిస్ట్ కామెంట్స్

ప్రస్తుతం నాగార్జున వారసులు నాగచైతన్య, అఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అలా అని నాగార్జున వెనకడుగు వేయకుండా వారికి గట్టి పోటీ ఇచ్చే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్ మాత్రం నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున గురించి కొన్ని సన్సేషనల్ కామెంట్స్‌ చేశారు.

నాగార్జున ఏడున్నర గంటలు అలా.. ఇప్పటికీ వినలేదు

కిరణ్ మాట్లాడుతూ.. “కుర్రాళ్ల రాజ్యం అనే సినిమా తర్వాత ఒక కథ చెప్పడానికి నేను నాగార్జున ఇంటికి వెళ్లాను. నేను చెప్పే కథ వినటానికి ఆయన ఏకంగా ఏడున్నర గంటల సమయం కేటాయించారు. నాగార్జున నా కోసం అంత సమయాన్ని కేటాయించడం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేదని చెప్పాడు కిరణ్. నేను చెప్పిన కథలో నాగార్జున ఒక రెండు సీన్లను కరెక్షన్ చేయాలని చెప్పాడు. ఇప్పటికి నేను ఆ కథ చెప్పి 17 ఏళ్లు గడిచింది కానీ ఆ రెండు సీన్ల కరక్షన్ మాత్రం నాగార్జున వినలేదు.ఎందుకంటే ఆయనకి వినడానికి సమయం లేదు, నాగార్జున చాలా బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. అందుకే కరెక్షన్ చేసిన సీన్లను వినడానికి ఆయనకు తీరికలేదు” అని చెప్పుకొచ్చాడు.


Share

Related posts

AP Govt: సుప్రీంలో ఏపి ప్రభుత్వానికి గట్టి షాక్..ఏకంగా లక్ష జరిమానా..

somaraju sharma

సీక్వెల్ ప్లాన్‌లో రాజ‌మౌళి…

Siva Prasad

Today Horoscope సెప్టెంబర్ 12th శనివారం మీ రాశి ఫలాలు

Sree matha