33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

`బింబిసార` కోసం క‌ళ్యాణ్ రామ్ అంత‌లా క‌ష్ట‌ప‌డ్డాడా..మేకింగ్ వీడియో వైర‌ల్‌!

Share

`బింబిసార`.. ఆగ‌స్టు 5న విడుద‌లైన ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా, కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ వశిష్ఠ్ తెర‌కెక్కించిన సోషియో ఫాంటసీ మూవీ ఇది. ఇందులో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టించారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. చింతరామన్ భట్ ఈ చిత్రానికి పాటలు అందించగా.. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం.. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ దూసుకెళ్తోంది.

దాదాపు రెండు నెలలుగా హిట్‌ లేక విలవిలలాడుతున్న టాలీవుడ్‌.. మ‌ళ్లీ `బింబిసార‌`తో ఊపిరి పీల్చుకుంది. ఇక‌పోతే ఈ సినిమాలో బింబిసారుడు, దేవదత్తుడు అనే రెండు విభిన్న పాత్రల‌ను పోషించి.. త‌న‌దైన న‌ట‌న‌తో క‌ళ్యాణ్ రామ్‌ విశేషంగా ఆక‌ట్టుకున్నాడు.

అయితే `బింబిసార‌` కోసం ఆయ‌న ఎంత‌లా క‌ష్ట‌ప‌డ్డాడు, రిస్కీ షాట్స్ ను టీమ్ ఎలా తెర‌కెక్కించింది, ఫైట్ సీన్స్ ఎలా రూపొందించారు వంటి విష‌యాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తూ.. తాజాగా మేకింగ్ వీడియోను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన కొద్ది సేప‌టికే నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రి ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.


Share

Related posts

Radhe shyam : రాధేశ్యామ్ అనుకుంటే సలార్ అంటున్నారు..డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్..!

GRK

Mahesh : మహేష్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్..!!

sekhar

Rajinikanth: చాలా కాలం తర్వాత రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్…!!

sekhar