Acharya : తెలుగులో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఆచార్య ఒకటి. మెగాస్టార్ 152వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇద్దరు కలిసి నక్సలైట్ పాత్రల్లో కనిపించే సీన్స్ చాలా బాగా వచ్చాయని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్ర, సంగీత ప్రత్యేక గీతాలలో కనిపించబోతున్నారు. ఇప్పటికే సంగీత – కాజల్ అగర్వాల్ నటించిన లాహే లాహే సాంగ్ రిలీజై విపరీతంగా ఆకట్టుకుంది.
కాగా ఈ సినిమా మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం మే 13న భారీ స్థాయిలో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా వెంటాడటంతో షూటింగ్ దశలోనే నిలిచిపోయింది. తిరిగి గత నెలలో షూటింగ్ ప్రారంభించిన ఆచార్య బృందం తాజాగా టాకీపార్ట్ మొత్తాన్ని పూర్తి చేసింది. ఈ మేరకు ఆచార్య టీం ట్విట్టర్ ద్వారా అప్డేట్ ఇచ్చారు. ఆచార్య టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిందని, కేవలం రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉందని ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు త్వరలో ఆ రెండు పాటలను కూడా పూర్తి చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశం ఉందని మెగా అభిమానులు భావిస్తున్నారు.
Acharya : ఆచార్య రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి.
అంతేకాదు త్వరలో అధికారకంగా ఆచార్య సినిమా రిలీజ్ డేట్ పై కూడా మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ అందిస్తున్న సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆచార్యకి చాలా హైలెట్గా నిలవనున్నాయట. అయితే కొందరిలో ఆచార్య రిలీజ్ ఈ ఏడాది ఉండే అవకాశాలున్నాయా అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే దాదాపు అన్నీ పాన్ ఇండియన్ సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయి. రవితేజ ఖిలాడి, బాలకృష్ణ అఖండ, వెంకటేశ్ దృశ్యం, గని, లైగర్ సినిమాలు తప్ప మిగతావన్ని డేట్స్ లాక్ అయ్యాయి. మరి ఆచార్య రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో చూడాలి.