Alcohol: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలా మంది ఆనందం కోసమో లేక ఫ్యాషన్ కోసమో లేక బలహీనతల వల్లనో తీసుకుంటూ ఉంటారు. అయితే మద్య సేవనం వల్ల దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కొందరు దీనికి పూర్తిగా బానిసలుగా మారి రోజు తాగుతుంటారు. మరి కొందరు ఎప్పుడో ఒక సారి తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీళ్లు తాము లిమిట్ గా తాగుతున్నాము కదా ఏమి కాదు అన్న భరోసాతో ఉంటుంటారు. ఎక్కువగా తాగినా, కొద్దిగా తాగినా దాని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జీవితంలో ఒక్కసారి మద్యపానానికి అలవాటు పడిన తరువాత వాళ్లు ఇక దాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.
Alcohol: లిమిట్ గా మద్యం తీసుకున్నన్నా
లిమిట్ గా మద్యం తీసుకున్న వారిలో అప్పటికప్పుడు దుష్పలితాలు ఏమీ కలగకపోయినా దీని ప్రభావం నిదానంగా బయటపడుతుంది. మద్యం తీసుకోవడం వల్ల దాని ప్రభావం శరీరంలోని ప్రతి అవయవంపైన చూపి వాటి పనితీరును తగ్గించి అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. అయితే రోజూ ఒక గ్లాస్ మద్యపానం తీసుకుంటే మంచిదని కొంత మంది భావిస్తుంటారు. మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటుంటారు. అయితే తక్కువగా తీసుకున్నా ఆరోగ్యానికి నష్టమేనని ఒక పరిశోధనలో తేలింది. మద్యం సేవించే వ్యక్తులపై ఓ సంస్థ పరిశోధన చేపట్టగా కొద్ది మోతాదులో మద్యం సేవించే వారిలో గుండె జబ్బుల నుంచి కాస్త రక్షణ లభించవచ్చేమో కానీ దీని కారణంగా క్యాన్సర్ల వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తేలిందట.
కొద్ది మోతాదులో మద్యం సేవిస్తే కలిగే లాభాల కన్నా ఎక్కువ మొత్తంలో నష్టం కలుగుతుందని చెబుతున్నారు. మద్యం ఎక్కువగా తీసుకునే వారి మెదడు పనితీరు మొద్దుబారిపోతుందట. వారు పూర్తిగా మద్యానికి బానిసలై భాంధవ్యాలకు విలువ ఇవ్వడం లేదట. అయితే కొద్ది మోతాదులో తాగేవారిలో వీటి లక్షణాలు తొందరగా బయటపడటం లేదట. తమ జీవితకాలాన్ని పెంచుకోవాలనుకునే వారు మద్యపానానికి దూరంగా ఉండడమే మంచిదని అంటున్నారు. ఈ దుర అలవాటుకు దూరంగా ఉంటే ఇల్లు, వళ్లు గుల్ల కాకుండా కాపాడుకున్న వారు అవుతారు.