నేటి సమాజం లో మందు కొట్టడం అనేది చాలా సాధారణ విషయంగా ఉంది. అందులోనూ ఇప్పుడు యుక్త వయసు లో ఉన్న వారు మందు కొట్టడం అనేది కల్చర్ గా, ఒక స్టైల్ గా, హక్కుగా భావిస్తూ విచ్చలవిడిగా మందుకొట్టేస్తున్నారు.
కాలేయ వ్యాధులకు దారితీసే 100 కారణాల్లో, మద్యం ముందు ఉంటోంది. ప్రపంచవ్యాప్తం గాచుస్తే కాలేయవ్యాధులు మద్యం వలన వచ్చినవే ఎక్కువ. ఈ ప్రపంచం వ్యాప్తం గా 40 శాతం మందికి మద్యం తీసుకునే అలవాటు ఉంటే, అది భారతీయుల్లో గత 20 ఏళ్ల లో ఇంతకు నాలుగు రెట్లు పెరిగినట్టు సర్వేలు తేల్చాయి. మద్యం వలన కాలేయ వ్యాధులు, మరణాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గత పదేళ్ల కాలం లో స్త్రీ లలోకూడా మద్యపానం అలవాటు బాగా పెరిగింది. అయితే ఈ మద్యం వలన పురుషులతో పోలిస్తే, స్త్రీలకు ముప్పు ఎక్కువ గా ఉంటుంది. అయితే ఇలా మందుకొట్టే వాళ్లకు సంజీవని వంటిది బీరకాయా.
బీరకాయల్లో ఉండే ఆల్కలాయిడ్లూ, పెప్టయిడ్స్, మూత్రంలో, రక్తం లోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. బీరకాయలు రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ కూడా ఇది రక్షిస్తుంది. బీర లో ఉండే మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెరిగే లా చేయడం వలన షుగర్ వ్యాధి రాకుండా చేస్తుంది.
బీరకాయ లో ఉండే విటమిన్-ఎ కంటి యొక్క కండరాల బలహీనత కారణం గా తలెత్తే అంధత్వాన్ని రాకుండా చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. కడుపులో మంట అల్సర్లు, తో బాధపడే వాళ్లకి బీరకాయ దివ్య ఔషదం లా పనిచేస్తుంది. బీరకాయల్లోని విటమిన్ బి6 ఎనీమియాని అరికడుతుంది. దీనిని ఆరేళ్లపాటు ఆహారం లో తీసుకున్న వాళ్లలో కంటి కండరాల క్షీణత 25 శాతం వరకూ తగ్గిందని పరిశోధనల్లో బయటపడింది.