Allu Arjun: స్టైలిష్ స్టార్ టాగ్ లైన్ నుండి “ఐకాన్” స్టార్ గా మారినా అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన బ్యాలెన్సింగ్ షూటింగ్ జులై నెలలో ప్రారంభం కానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. జులై మాసం ప్రారంభం లో గోవాలో ఈ సినిమాకి సంబంధించి ఇంట్రడక్షన్ సాంగ్ అదే రీతిలో కొన్ని కీలకమైన సన్నివేశాలు.. చిత్రీకరించడానికి సుకుమార్ సరికొత్త షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని ఆల్రెడీ తేదీ ప్రకటించడం జరిగింది. అయితే తేదీ మారే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు కొద్దికొద్దిగా వినబడుతున్నాయి. ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ చేస్తూ ఉండటంతో “పుష్ప” సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం విషయంలో బన్నీ అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు.. అదే రీతిలో అవుట్ పూట్.. కూడా ఓ రేంజ్ లో ఉన్నట్లు ఇప్పటికే సినిమా చూసిన ప్రముఖులు కామెంట్లు చేస్తున్నారు.
Read More: Icon : ఐకాన్ స్క్రిప్ట్ లో మార్పులు..పాన్ రేంజ్ లో ప్లాన్
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బన్నీ.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “ఐకాన్” సినిమా స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు లేటెస్ట్ టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. పుష్ప సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ వర్క్ మొత్తం ఆగస్టులోపు కంప్లీట్ చేసి … సెప్టెంబర్ మాసం నుండి ఈ సరికొత్త ప్రాజెక్టు ఐకాన్ సినిమా షూటింగ్ ఏకధాటిగా చేసే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం వేణు శ్రీరామ్ కంప్లీట్ చేసినట్లు… బన్నీ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు.. ఏది ఏమైనా పుష్ప అయిన వెంటనే ఐకాన్.. చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.