NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

అంతర్వేది అప్డేట్..! బీజేపీ × వైసీపీ

 

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శీ లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయ రథం అగ్నికి ఆహుతి అవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆలయాన్ని మంత్రుల బృందం సందర్శించిన సమయంలోనే పెద్ద సంఖ్యలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, హింధూ ధర్మిక సంఘాల కార్యకర్తలు, నేతలు ఆలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసన కారులను పోలీసులు అదుపుచేసే ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి, జనసేన అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్‌లు “చలో అంతర్వేది”కి బుధవారం పిలుపునిచ్చారు.

అంతర్వేదిలో పోలీసు ఆంక్షలు

అంతర్వేదిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు విచారణకు ఆదేశించింది. మరో పక్క ఆలయ పరిసర ప్రాంతాల్లో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు ఏలూరు రేంజ్ డీఐజి కెవి మోహనరావు వెల్లడించారు. ఇతరులు ఎవ్వరూ ఈ ప్రాంతానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిన్న కొంత మంది శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నించారనీ అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఐజి హెచ్చరించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.

పోలీస్ పహారా మధ్య అంతర్వేది ఆలయం

బిజెపి, జనసేన చలో అంతర్వేది పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అంతర్వేది ఆలయ పరిసర ప్రాంతంలో, గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి బిజెపి, జనసేన, విహెచ్‌పి కార్యకర్తలు, నాయకులు అంతర్వేది ఆలయానికి చేరకుండా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలపై బైండవర్ కేసులు నమోదు చేస్తున్నారు.

హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు డిమాండ్

అంతర్వేది ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తుపై తమకు నమ్మకం లేదనీ, హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని బిజెపి, జనసేన అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ లు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం పోలీసు దర్యాప్తునే కొనసాగిస్తున్నది. ఈ ఘటనను బిజెపి, జనసేన, హింధూ సంఘాలు తీవ్రంగా పరిగణనిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N