NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకకు సీఎం జగన్ డుమ్మా .. రీజన్ అదేనా..?

YS Jagan: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి హజరు కాలేదు. రాజస్థాన్ లోని జోథ్ పుర్ లో షర్మిల కుమారుడు రాజారాడ్డి – ప్రియా అట్లూరి వివాహం ఘనంగా జరిగింది.

కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జోధ్ పూర్ లోని ఉమైద్ భవన్ లో ఈ వివాహం జరిగింది. 16న సంగీత్, మోహందీ వేడుక నిర్వహించగా, 17న సాయంత్రం వివాహం జరిగింది. 18న ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొత్త దంపతులు షర్మిలను హత్తుకున్న ఫోటో నెటిజన్ లను ఆకట్టుకుంటోంది.

అయితే, షర్మిల కుమారుడు వివాహ వేడుకకు ఆమె సోదరుడు, సీఎం వైఎస్ జగన్ హజరు కాకపోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. జనవరి 17న హైదరాబాద్ లో జరిగిన నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా జగన్ హజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. నిశ్చితార్ధ వేడుకకు జగన్ దంపతులు హజరు కావడంతో వివాహ వేడుకకు హజరు అవుతారని అందరూ భావించారు. అయితే ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి షర్మిల .. అన్న జగన్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఇతర ప్రతిపక్షాలు చేయని విమర్శలు కూడా షర్మిల చేస్తున్నారు. జగన్ ను, ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పెడుతున్నారు. దీనికి తోడు జగన్ మేనల్లుడి నిశ్చితార్ధ వేడుకకు హజరైన సమయంలో షర్మిల అంటీ మున్నట్లుగా వ్యవహరించారనీ, గ్రూప్ ఫోటో దిగేందుకు కూడా షర్మిల ఆసక్తి చూపకపోవడం, జగన్ పదేపదే కోరడం, విజయమ్మ రమ్మని చెప్పిన తర్వాత అయిష్టంగా షర్మిల గ్రూపు ఫోటో దిగినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అంతే కాకుండా జగన్ దంపతులు వెళ్లే సమయంలోనూ షర్మిల దంపతులు వాళ్లను కొద్ది దూరం కూడా అనుసరించలేదు. ఆ కార్యక్రమంలో సరైన గౌరవం లభించకపోవడం వల్లనే వివాహ మహోత్సవానికి డుమ్మా కొట్టి ఉంటారనే టాక్ నడుస్తొంది. దీనికి తోడు మరో వాదన ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జగన్ బిజీబిజీగా ఉన్నారు. ఓ పక్క అభ్యర్ధుల ఎంపిక, మరో పక్క సిద్ధం పేరిట జరుగుతున్న సభల్లో పాల్గొనడం తదితర కారణాల వల్ల ఆయన తన మేనల్లుడి వివాహ వేడుకకు దూరంగా ఉన్నారని అంటున్నారు.

అయితే హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్డ్ గ్రాండ్ లో నిర్వహించే రాజారెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ కు జగన్ హజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ రిసెప్షన్ కూ జగన్ దంపతులు గైర్హజరు అయితే అన్నా చెల్లెళ్ల మధ్య దూరం తీవ్ర అఘాదం ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు ..నోటీసులు జారీ చేసిన కోర్టు

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju