(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అసిక్స్ స్పోర్ట్స్ వేర్ షాప్ ప్రమోషనల్ స్క్రీన్‌పై పోర్న్ వీడియోలు ప్లే అవ్వడంపై స్టోర్ నిర్వహకులు క్షమాపణలు చెప్పారు. న్యూజిలాండ్‌లోని అక్లాండ్లో అసిక్స్ అనే స్పోర్ట్స్ స్టోర్ బయట ఉన్న ప్రమోషనల్ బిగ్ స్క్రీన్‌పై పోర్న్ వీడియోలు ప్లే అయ్యాయి. దీంతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. కుటుంబసభ్యులతో, చిన్నపిల్లలతో కలిసి రోడ్డుపై వచ్చిన వారు ఆ దృశ్యాలను చూసి ఖంగుతిన్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు మాత్రం ఆ దృశ్యాలను చూస్తూ అక్కడే ఉండిపోయారు. తొమ్మిది గంటల పాటు ఈ వీడియోలు ప్లే అయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు స్టోర్‌కు వచ్చిన సిబ్బంది ఆ వీడియోలు ప్లే కాకుండా చేశారు. అయితే ఎవరో హ్యాకింగ్ చేయడం వల్లనే ఇలా జరిగిందని స్టోర్ ప్రతినిధి తెలిపారు. దీనిపై క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై తాము విచారణ జరుపుతున్నామని… మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామన్నారు.