ట్రెండింగ్ న్యూస్

Big Breaking: తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ హీరోగా బండ్ల గణేష్..!!

Share

Big Breaking: టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గణేష్.. వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసి నిర్మాతగా మారి.. ఇండస్ట్రీలో అనేక సెన్సేషనల్ ప్రాజెక్టులు నిర్మించారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మరికొంత మంది హీరోలతో సినిమాలు నిర్మించిన బండ్లగణేష్.. ఆ తర్వాత అప్పట్లో తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి..పార్టీ ఓడిపోయిన టైంలో సైలెంట్ అయిపోయారు.

అయితే ఇటీవల మళ్లీ కమెడియన్ గా సినిమాలు చేస్తున్న బండ్లగణేష్.. తాజాగా హీరో గా సరికొత్త అవతారం ఎత్తారు. విషయంలోకి వెళితే వెంకట్ చంద్ర అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తమిళ సినిమా “ఒత్తత సెరుపు సైజ్ 7” అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్ వైరల్ అవుతుంది. ఇప్పటి దాకా ఇండస్ట్రీలో కమెడియన్ గా సినిమాలు చేసి హీరో గా ప్రయోగాలు చేసిన వాళ్ళు చతికిల పడ్డారు. ఇటువంటి తరుణంలో బండ్ల గణేష్ హీరోగా సినిమా చేయడానికి ముందుకు రావడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కమెడియన్ గా… బిజినెస్ మాన్ గా… ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయిన.. బండ్ల గణేష్ హీరోగా ఏ మేరకు రాణిస్తడో చూడాలి.


Share

Related posts

ఇది కరెక్టు యాంగిల్ ! వైఎస్ జగన్ పాలనకు అతి పెద్ద మచ్చ ఇదే !!

Yandamuri

బిగ్ బాస్ 4: దెబ్బకి సోహైల్ కాలు పట్టేసుకున్న అవినాష్..!!

sekhar

Heel Pain: ఇలాచేస్తే క్షణాల్లో లో మీ మడమ నొప్పి మాయం..!!

bharani jella