Bathuku Bustand : స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ బావమరిది ముత్తం శెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్..!! ఇలవల ఫిలిమ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో ఐ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కవితారెడ్డి , కే మాధవి నిర్మిస్తున్నారు.. తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. తాజాగా ఈ సినిమాలో హీరో ను పరిచయం చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు..!!

ఈ సినిమాలో నిఖిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ఈ చిత్రానికి మహావీర్ సంగీతం సమకూరుస్తున్నారు.. వాసు కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన బతుకు బస్టాండ్ సినిమా లోని విరాన్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది.. జూన్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..