NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Beet Root: ఇంట్లోనే బీట్ రూట్ మొక్కలను ఎలా పెంచుకోవాలో 10 సింపుల్ స్టెప్స్ లో చూపించిన స్వాతి

Beet Root crop in your home garden

Beet Root: బెంగుళూరు నగరానికి చెందిన స్వాతి.. దాదాపు రెండు వందల రకాల కూరగాయలను ఆమె ఇంట్లోనే పెంచుతోంది. యూట్యూబ్ లో ‘బ్యాక్ యార్డ్ గార్డెనింగ్’ ఛానల్ లో ప్రకృతి సహజ సిద్ధమైన బీట్ రూట్ ను ఇంట్లో ఎలా పెంచుకోవాలో నేర్చుకుందాం. 2017 లో యూట్యూబ్ వీడియో ఛానల్ స్టార్ట్ చేసిన స్వాతి కి ప్రస్తుతం 95,000 subscribers ఉన్నారు. 

 

Beet Root crop in your home garden

ఇంట్లోనే రెండు వందల రకాల చెట్లను ఎలా పెంచాలో ఆమె వివరిస్తూ ఎన్నో వీడియోలు చేసిన స్వాతి తాజాగా ఇంట్లోనే బీట్ రూట్ ను ఎలా పెంచాలి… దీన్ని ఎలా కాపాడుకోవాలనే విషయంపై చిన్న ట్యుటోరియల్ ఇచ్చారు.

మనం మార్కెట్లో లేదా వెజిటేబుల్ షాప్స్ లో కొన్ని తాజా రకమైన బీట్రూట్స్ ని ఇంట్లోనే ఎలా పెంచుకోవాలంటే…

Beet Root: దీనికి అవసరమైనవి

ఒక బీట్ రూట్ 

ఒక గాజు గిన్నె 

నీళ్లు 

మట్టితో నిండిన కుండ 

ఒక బీరా

10 Steps to grow beetroot

1. ముందుగా మన దగ్గర ఉన్న బీట్ రూట్ పైన ఎండిన ఆకులను తీసేయాలి

2. దాని తర్వాత ఆ పై భాగంలో కొంచెం కట్ చేయాలి

3. ఇప్పుడు ఆ బీట్ రూట్ ముక్కని ఒక గాజు గిన్నెలో వేసి నీళ్లతో నింపాలి. ఈ సమయంలో లో బీట్ రూట్ పూర్తిగా మునగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే అది కుళ్ళిపోయే ప్రమాదం ఉంది

4. దీనిని మన వంటగదిలో లేకపోతే కిటికీ పక్కన నేరుగా ఎండ తగలకుండా పెట్టాలి

5. దాదాపు మూడు నాలుగు రోజుల్లోనే అందులో నుండి తాజా ఆకులు మొలవడం గమనించవచ్చు.

6. రోజు మార్చి రోజు అందులోని నీటిని మారుస్తూ ఉండాలి. 15వ రోజుకి ఆకులు పూర్తిస్థాయిలో పెరుగుతాయి. అప్పుడు దానిని మట్టి తో నిండిన కుండ లోనికి మార్చేయాలి.

7. ఇప్పుడు దానికి సమృద్ధిగా నీరు పోస్తూ కొద్దిగా ఎండ తగిలేలా పెడుతూ ఉంటే మరొక మూడు నాలుగు నెలల్లో పువ్వులు పూయడం మొదలుపెడతాయి. ఇలా వచ్చిన పువ్వులను, కొమ్మలను ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత అలాగే ఉంచితే… అందులోని విత్తనాలు చలి కాలం నాటికి వృద్ధిచెందుతాయి.

8. ఈ విత్తనాలను మట్టిలో ఒకదానికి మరొకటి ఇంచు దూరంలో నాటాలి. ఆ విత్తనాలు మట్టితో కప్పిపెట్టి తరచుగా నీరు పోస్తూ ఉండాలి. 

9. 24 రోజుల్లో ఆ విత్తనాల నుండి మొలకలు పెరగడం మనం గమనించవచ్చు. 

10. ఆ తర్వాత ఆ విత్తనాలు మొలకెత్తి… తర్వాత వాటిని తీసి మన ఇంటి గార్డెన్ లో నాటాలి. వారానికి ఒకసారి నీరు పోస్తూ దగ్గరలో దొరికే ఎరువులు వాడుతూ ఉంటే 90 రోజుల్లో తాజా బీట్ రూట్ మన చేతికి వస్తుంది.

author avatar
arun kanna

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju