ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్బాస్ సీజన్ ఆసక్తికరమైన టర్న్ తీసుకుంటోంది. షో చివరంకానికి చేరడంతో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక అదే సమయంలో ఈ వారం ఎలిమినేషన్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. దాని సంబంధించి ఒక సీక్రెట్ బయటకు వచ్చింది.
నాలుగో సీజన్ ఆరంభం నుండి రికార్డు స్థాయి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ షో లో మంచి ఫలితాలు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ చాలా హాట్ హాట్ గా జరుగుతోంది. ఇక ఈ విషయంలో నిర్వాహకులు ప్రస్తుతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రజాదరణ ఉన్న కొందరు కంటెస్టెంట్ లు బయటకు వెళ్లిపోయిన తర్వాత ప్రేక్షకులకు షో పైన అనుమానాలు రావడం మొదలయ్యాయి.
ఈ వారం విషయానికి వస్తే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ల పేరు రెండు రోజులు ముందే లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఎవరికీ అర్థం కాని రీతిలో అఖిల్ సీక్రెట్ రూమ్ కి ఎందుకు వెళ్ళాడు…. అతనికి ఆ సౌలభ్యం ఎందుకు కల్పించారు అన్నది ప్రశ్న. ఇకపోతే అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిన కారణంగా ఈవారం ఎలిమినేషన్ ఉండబోదని అందరూ అనుకున్నారు.
కానీ తాజా సమాచారం ప్రకారం తక్కువ ఓట్లు వచ్చిన వారు ఇంటి నుండి బయటికి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. అఖిల్ వచ్చే వారం ఇంటి లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ లోపల ఒకరిని ఇంటి నుండి బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయని టాక్…!