NewsOrbit
న్యూస్ సినిమా

అక్కడ ఇద్దరూ ఫెయిల్ ! ఇక్కడైనా మళ్లీ సక్సెస్ అవుతారా?

ఆ భక్తుడికి ‘దేవుడు ‘ వరం ఇచ్చేశాడట.ఇక సినిమా తీయడమే తరువాయట..ఈనాటి తాజా వార్త ఇది.ఇప్పటికే ఆభక్తుడెవరో …ఆ దేవుడెవరో పాఠకులు కనిపెట్టేసివుంటారు.

Both of them fail there Will they succeed here again
Both of them fail there Will they succeed here again

అవును మీ ఊహ కరెక్టే!ఆ దేవుడు పవన్ కళ్యాణ్ …భక్తుడేమో బండ్ల గణేష్ బాబు!పవన్‌ ని తన దేవుడిగా ఎప్పుడూ చెప్పుకునే బండ్ల గణేశ్‌ ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ .‌తో సినిమా చేయబోతున్నాడట. ఈ విషయాన్ని గణేష్‌ తన అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా ప్రకటించారు. ‘నా బాస్‌ ఓకే చెప్పారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాను. నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఆయనతో చేస్తున్నాను. నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కళ్యాణ్ .‌కు ధన్యవాదాలు’ అని మెసేజ్‌తోపాటు పవన్‌కల్యాణ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు.ఇప్పటికే ఆయన పవన్‌తో కలిసి రెండు సినిమాలను చేశారు.

‘తీన్ మార్, గబ్బర్ సింగ్’ వంటి సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవరించారు.తీన్‌ మార్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా.. గబ్బర్ సినిమా మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.వీరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా తెరకెక్కనుంది..? ఎవరు డైరెక్ట్‌ చేస్తారు..? అనే అంశాలు ఇప్పుడు పవన్‌ అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ని నా దేముడు అని అన్ని వేదికల మీద చెప్పుకునే బండ గణేష్ రాజకీయ రంగప్రవేశం చేసేపుడు మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు .పవన్ కల్యాణ్ కి జనసేన పార్టీ ఉన్నాబండ్ల గణేష్ అటువైపు చూడను కూడా లేదు.పైగా పవన్ కల్యాణ్ ఏ పార్టీ వారి పంచెలనయితే వూడ కొడతానన్నాడో అదే కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపైనర్ గా బండ్ల గణేష్ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ రాక ముందే ఎమ్మెల్యేగా తాను ఎలా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడో బండ్ల గణేష్ ఒక టీవీ షోలో డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం పెద్ద కామెడీగా మారింది .

అప్పట్లో బండ్ల గణేష్ ఏ చానల్ ఇంటర్వ్యూకు వచ్చినా మీరు మీ దేవుడు పార్టీలో కాకుండా కాంగ్రెస్ లో ఎందుకు చేరారనే ప్రశ్న ఆయనకు ఎదురయ్యేది.ఆ ప్రశ్న అడగనంటేనే ఇంటర్వ్యూలకు వస్తానని బండ్ల గణేష్ షరతు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే విధి వక్రించి బండ్లగణేష్ చేరిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది.బండ్ల గణేష్ కి కనీసం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కూడా దక్కలేదు .ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోయింది పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.ఇలా రాజకీయ రంగం లో విఫలమైన ఈ దేవుడు ..భక్తుడు మళ్లీ ఒకటై సినిమా రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju