నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు యమా క్రేజ్ ఉంటుంది. బాలయ్య ఫ్లాపుల్లో ఉంటే బోయపాటి శ్రీను సింహ సినిమా ని తెరకెక్కించి రికార్డ్ స్థాయిలో వసూళ్ళని సాధించి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. అదే నమ్మకంతో బాలయ్య మరోసారి బోయపాటికి అవకాశం ఇస్తే లెజెండ్ తీసి అదే రేంజ్ హిట్ ఇచ్చాడు.
అప్పటి నుంచి మళ్ళీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా అని బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడవ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అటు బాలయ్య ఇటు బోయపాటి ఇద్దరు కసిగా ఉన్నారు. అందుకు కారణం ఇద్దరికి గత చిత్రాలు ఫ్లాప్స్ గా మిగలడమే. అందులో ఇది హ్యాట్రిక్ సినిమా కాబట్టి లెక్క తప్ప కూడదని భావిస్తున్నారు.
ఎన్ బి కె 106 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి జూన్ 10 న గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలున్నాయని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఆరోజు బాలకృష్ణ పుట్టిన రోజు గనక బోయపాటి శ్రీను బాలయ్య కి సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మరి అదేంటో అని ఫ్యాన్స్ రక రకాలుగా చర్చించుకుంటున్నారు. వాస్తవంగా ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ ఏంటన్నది ఇంకా వెల్లడించలేదు. అలాగే బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ ఎవరన్నది తెలుపలేదు. ఇవన్ని కలిపి బోయపాటి శ్రీను జూన్ 10 వెల్లడించనున్నాడని అనుకుంటున్నారు. మరి బోయపాటి ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తాడా లేక గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాడా చూడాలి.