RRR Release: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వేచి చూస్తున్న రాజమౌళి తదుపరి సినిమా ఆర్ఆర్ఆర్ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. దీంతో అభిమానులు అందరూ ఉసూరుమంటున్నారు.
“సినిమాని రిలీజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. భారతదేశం లోని చాలా రాష్ట్రాలు థియేటర్లను మూసేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కొద్దిరోజులు వేచి ఉండమని అడగడం తప్ప మా వద్ద మరో ఛాయిస్ లేదు. మూవీ యూనిట్ అందరూ కలిసి సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించాం. త్వరలోనే సినిమాతో మీ ముందుకు వస్తాం.” అని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రకటించింది. అయితే జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. ఏ రోజుకి వాయిదా వేస్తున్నామనే విషయాన్ని ఇప్పటివరకైతే వెల్లడించలేదు. త్వరలోనే కొత్త రిలీజ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.