Colgate: కోల్గేట్ టూత్ పేస్ట్ గురించి తెలియని వారుండరు. అంతలా అది మార్కెట్లో దూసుకుపోతోంది. అలాంటి పేస్ట్ మహారాష్ట్రలో బ్యాన్ కానుందట! రాష్ట్ర వ్యాప్తంగా కోల్గేట్ ఉత్పత్తుల పంపిణీ నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారట. ఈరోజు అనగా, జనవరి 1వ తేదీ 2021 నుంచి పేస్ట్‌లు, ఇతర ఉత్పత్తులను అక్కడ దశల వారీగా పంపిణీ ఆపేయనున్నారు. ఇక ముఖ్యంగా ఈరోజు నుంచి మ్యాక్స్ ఫ్రెష్ పేస్ట్‌ల ఉత్పత్తిని అక్కడ నిలుపుదల చేయడం జరిగింది. అలాగే వచ్చే వారంలో వేదశక్తి పేస్ట్‌ను సైతం పంపిణీ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Shanmukh Jaswanth: దీప్తి బ్రేకప్ పోస్టుపై షణ్ముఖ్ ఇలా స్పందించాడేంటి.. గుండె పగులుతున్న ఫ్యాన్స్..!!
అక్కడ ఎందుకిలా జరుగుతోంది?
అలాగే ఈ జనవరి నెల మూడవ వారలో అక్కడ కోల్గేట్ టూత్ బ్రష్స్లు పంపిణీ ఆగిపోనుంది. అలాగే కంపెనీ పూర్తి ఉత్పత్తుల పంపిణీ ఫిబ్రవరి 1న ఆపేయాలని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే… ధరల అసమానతలే కారణం అంటున్నారు. సంప్రదాయ వ్యాపారపు రేట్లకు అలాగే జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్ లాంటి కామర్స్ B2B కంపెనీల రేట్లుకు చాలా తేడా ఉంటోంది. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. అంటే B2B స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని చెప్తున్నారు. దాంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
Shanmukh Jaswanth: దీప్తి బ్రేకప్ పోస్టుపై షణ్ముఖ్ ఇలా స్పందించాడేంటి.. గుండె పగులుతున్న ఫ్యాన్స్..!!
అన్ని చోట్లా ఇలానే వుంటుందా?
అవును.. అన్ని చోట్ల ఇలానే ఉంటుంది మరి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ వ్యత్యాసాలు బాగా వున్నాయి. ఈ సందర్భంగా కోల్గేట్ పాల్మోలైవ్ ఇండియా, పంపిణీదారుల చర్యలపై స్పందించింది. డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌తో త్వరలోనే సంప్రదింపులు జరుపుతామని సమస్యను పరిష్కరించి సవాళ్లను అధిగమిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు Edelweiss సెక్యూరిటీస్ తన నివేదికలో ఈ సమస్యలు ముందుగానే జరిగాయని, HUL మరియు డిస్ట్రిబ్యూటర్లు త్వరలో ఒక ఒప్పందానికి వస్తారని అంచనా వేయడం కొసమెరుపు.