NewsOrbit
న్యూస్

ఊరువాడ కరోనా భయం మరో విధంగా కూడా..!

 

కరోనా భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎదుటి వారితో కరచాలనం చేసినా, మాస్కులు పెట్టకుండా బయటికి తిరిగినా, భౌతిక దూరం పాటించక పోయినా ఇలా ఏవిధంగా అయినా కరోనా వ్యాపిస్తోందన్న ఆందోళన నేపథ్యంలో మానవాళి మొత్తం మాస్కులను అలవాటు చేసుకున్నారు. జన జీవనం కూడా స్వేచ్ఛ నశించింది. ఈ తరుణంలోనే కరోనా వ్యాప్తికి మరిన్ని కారణాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో కరోనా భయం అలుముకుంది. కరోనాతో మరణించిన వారి అంతిమ క్రియలకు కొన్నిచోట్ల పోరు జరుగుతోంది. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరగడం ప్రభుత్వాన్ని కూడా ఒక రకమైన తలనొప్పిగా మారింది. తాజాగా ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కారణంగా మరణించినఒ వ్యక్తిని ఒంగోలు సమీపంలోని ఎరజర్ల అనే గ్రామం వద్ద దహన సంస్కారాలు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అడ్డుకుని నానా రభస చేశారు. ఇదే తరహాలో నిన్న కూడా కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో ఒ గ్రామంలో అడ్డుకున్నారు.

కరోనా తో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. మనం పోరాటం చేయాల్సింది రోగితో కాదు వ్యాధితో. వారిని వివక్షత చూడకండి అంటూ ఎవరికి ఫోన్ చేసినా మనకు ప్రస్తుతం ఇవే మాటలు వినిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవే సూచనలు చేస్తున్నాయి. కానీ మరణించిన రోగుల పట్ల మాత్రం మానవ జాతి వివక్ష చూపుతూనే ఉంది.వారిలోని కరోనా భయం, కరోనా పట్ల అప్రమత్తత, లేనిపోని రిస్క్ మనకు ఎందుకు అనే దీనిలో తమ సమీప పల్లెలో కూడా రానివ్వడం లేదు. దీంతో ఈ మృత దేహాలకు ఎక్కడ దహన సంస్కారాలు నిర్వహించాలన్న దానిపై అధికారులకు పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏపీ లో మొదట్లో పెద్దగా మరణాలు లేనప్పటికీ గడిచిన వారం రోజుల్లో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ముందు నుంచి మరణాల అనంతరం ఏం చేయాలనే దానిపై ఆలోచించని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మరణాలు పెరుగుతుండటంతో తలలు పట్టుకుంటుంది. గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, కడప తదితర జిల్లాలో ఈ సమస్య అధికంగా ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో యధాతధంగా నిర్వహించే మరుభూమిలో కాకుండా ఊరికి దూరంగా ప్రజాజీవనానికి బాగా దూరంగా ఈ సంస్కారాలు నిర్వహించాల్సి వస్తోంది. కానీ వీటిని కూడా గ్రామస్తులు అడ్డుకోవడం ఒకింత ఆందోళన కరమైన అంశమే.

ఐసీఎంఆర్‌ నిబంధనలు ఇవి..

  • కరోనా సోకిన వ్యక్తులను అంత్యక్రియలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్‌ కొన్ని నిబంధనలను సూచించింది.
  • కోవిడ్‌తో మృతి చెందాడా లేదా అనేది ముందుగా నిర్ధారించుకోవాలి.
  • ఆస్పత్రి వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే మృతదేహాన్ని ప్యాక్‌ చేయాలి. ముందుగా మృతదేహంపై సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం స్ప్రే చేసి, పాలిథిన్‌ కవర్‌తో భద్రంగా ప్యాక్‌ చేయాలి.
  • అంత్యక్రియలకు వెళ్లే ముందు బట్ట, లేదా తాడు సాయంతో మృతదేహాన్ని పాడె పైకి తరలించారు.
  • పాడెను మోసుకొని వెళ్లేవారు మృతదేహాన్ని తాకకుండా చూసుకోవాలి
  • 20 మందికి మించి అంత్యక్రియల్లో పాల్గొనరాదు. వీళ్లు కూడా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju