Tokyo Olympics: ఒలింపిక్స్ లో సత్తా చాటిన మనోళ్ళ కోచ్ ల గురించి తెలుసుకుందామా…?

Coaches for Indian medalists in Tokyo Olympics
Share

Tokyo Olympics: ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో భారత్ అథ్లెట్లు సత్తా చాటారు. ఇప్పటివరకు ఒలింపిక్స్ చరిత్రలో మన దేశానికి ఇదే బెస్ట్ ఒలింపిక్స్. ఒక స్వర్ణం తో కలిపి మొత్తం ఏడు పతకాలను భారతదేశం సాధించింది. ఇక మన దేశంలో అందరూ క్రీడాకారులను కొనియాడే వారే. గెలిచినవారినే కాకుండా మెడల్ ను కొద్దిలో కోల్పోయిన వారిపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు. అయితే వారిని ఇంతటి నిష్ణాతులుగా తయారుచేసిన కోచ్ లను మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే మనవారి చేత పతకాలను గెలిపించిన కోచ్ ల గురించి కాస్త తెలుసుకుందామా…?

 

Coaches for Indian medalists in Tokyo Olympics

నీరజ్ వెనుకున్నది అతనే…

ముందుగా భారత్ కి అతడి మొదటి స్వర్ణపతకం అందించిన నీరజ్ చోప్రా గురువు గురించి తెలుసుకుందాం. క్లాస్ బర్తోనేయిట్జ్ నీరజ్ చోప్రా కు 2019 నుండి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. బయో మెకానికల్ నిపుణుడు అయిన క్లాస్ 2019లో నీరజ్ చోప్రా మోచేయి శస్త్రచికిత్స నుండి కోలుకున్న తర్వాత అతను మళ్లీ పూర్తిస్థాయిలో ఒలింపిక్స్ కి తయారు కావడంలో, ఫిట్ నెస్ విషయంలో కీలక పాత్ర పోషించాడు.

Tokyo Olympics: గురు సత్పాల్

అలాగే 57 కేజీల రెజ్లింగ్ లో రజతం సాధించిన రవికుమార్ కోచ్ సత్పాల్ సింగ్ గతంలో ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించాడు. ఇతనిని అందరూ ‘గురు సత్పాల్’ అని పిలుస్తారు. మొదటి నుండి రవి కుమార్ పైన విపరీత భరోసా ఉంచిన సత్పాల్ అతను పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

మీరా ను ఛాంపియన్ గా తయారు చేసింది అతనే…

భారతదేశానికి టోక్యో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించిన మీరాబాయి చాను గురువు విజయ్ శర్మ. ఇతను 2017 ప్రపంచ ఛాంపియన్షిప్ లో మీరా స్వర్ణం సాధించినప్పుడు కూడా ఆమెకు గురువు గా ఉన్నాడు. గత ఏడాది నుండి మీరాబాయి చాను నిలకడగా అధిక బరువులు ఎత్తడం లో ఇతని పాత్ర కీలకం. కొద్దిలో స్వర్ణ మిస్ చేసుకున్న మీరా ఇంతటి ఘనత సాధించడానికి ముఖ్య కారణం విజయ్ శర్మ నే.

గోపీచంద్ అకాడమీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత పీవీ సింధు కి పార్క్-తే-సంగ్ శిక్షణ ఇచ్చాడు. 2019లో సింధు కోచ్ గా పార్క్ బాధ్యతలు స్వీకరించాడు. ఇతని ట్రైనింగ్ లో సింధు చిరుతపులిలా తయారయిన సింధు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించింది. 

Coaches for Indian medalists in Tokyo Olympics

Tokyo Olympics: పాత మెడలిస్ట్… ఇప్పటి కోచ్

మహిళల బాక్సింగ్ లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా కు మహమ్మద్ అలీ కమర్ కోచ్ గా వ్యవహరించాడు. కమర్ కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం గెలిచిన మొట్టమొదటి ఇండియన్ బాక్సర్ గా గతంలో రికార్డు సృష్టించాడు. ఇలాంటి అద్భుత బాక్సర్ లవ్లీనా కు ఒలింపిక్స్ కి కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఆమె కాంస్య పతకం సాధించేలా ఆమె ఆటను తీర్చిదిద్దాడు. 

కోచ్ కాదు… తండ్రి లెక్క

ఇక చివరగా మరో ఆణిముత్యం బజరంగ్ పూనియా కోచ్ షాకో బెంటినిడిస్ గురించి చెప్పుకోవాలి. జార్జియా కు చెందిన షాకో మూడు సార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. బజరంగ్ తనకు కొడుకులాంటి వాడు అని చెప్పే షాకో బజరంగ్ కచ్చితంగా మెడల్ సాధిస్తాడని మొదట నమ్మింది కూడా అతనే. చివరికి బజరంగ్ అనుకున్నట్లే కాంస్య పతకం తో తిరిగి వచ్చాడు. 

చరిత్ర తిరగరాస్తూ ఒలింపిక్ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు గ్రహం రీడ్ కోచ్ గా ఉన్నాడు. 2019 నుండి జాతీయ హాకీ టీమ్ కోచింగ్ బాధ్యతలు చేపట్టిన రీడ్ శిక్షణలో భారత పురుషుల జట్టు ప్రదర్శన ఎంతో మెరుగుపడింది. ప్రపంచ స్థాయి జట్లను ఓడిస్తూ దూసుకుపోతున్న పురుషుల జట్టు విజయంలో గ్రహం రీడ్ ది కీలకపాత్ర.


Share

Related posts

పవన్ కల్యాణ్ పార్టీకి కొత్త పేరు పెట్టిన మంత్రి కొడాలి నాని!పవర్ స్టార్ కు స్ట్రాంగ్ కౌంటర్ !

Yandamuri

తెలంగాణ తల్లి ప్రార్థన గీతం విడుదల చేసిన మంత్రి కేటీఆర్…!

arun kanna

KCR : తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసిఆర్

somaraju sharma