జనవరి నాటికి పది కోట్ల ఆక్స్ ఫర్డ్ కరోనా టీకాలు..!

 

 

కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతున్న తరుణంలో, వ్యాక్సిన్‌ ప్రభావంతమైన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఊరటనిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం అందరు ఎదురు చూస్తున్న వేళ్ళ, సీరం సీఈవో తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసారు. ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సాయంతో తీసుకొస్తున్న కరోనా వైరస్ కు ‌ వ్యాక్సిన్‌పై సీరం సీఈవో మరోసారి కీలక విషయాన్ని ప్రకటించారు. టీకాను భారీగా తయారు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని మిస్టర్ పూనవల్లా తెలిపారు.

astrazenic vaccine

 

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా,సీఈవో అదార్ పూనవల్లా వ్యాక్సిన్ గురించి వివరాలు తెలుపుతూ, ఇప్పటికే 40 మిలియన్ టీకాలను ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. జనవరి నాటికి కనీసం 100 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామని, అలాగే ఫిబ్రవరి చివరి నాటికి వందల మిలియన్లు సిద్ధంగా ఉంటాయని అంచనావేశారు. బ్రిటన్, బ్రెజిల్‌ ట్రయిల్స్‌లో అస్ట్రాజెనెకా టీకా 90 శాతం ప్రభావవంతంగా ఉందని, అయినా తెలియాచేసారు.

గత వారం సీరం ఇన్స్టిట్యూట్ భారతదేశం కోసం ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పిన పూనవల్లా, ప్రతి భారతీయుడికి టీకాలు వేయడానికి 2024 వరకు పట్టవచ్చని చెప్పారు. టీకా భారతదేశంలో లభించడానికి మరో రెండు-మూడు నెలలు సమయం పడుతుంది అన్ని, జూలై నాటికి ప్రభుత్వం నిర్దేశించిన 300 నుండి 400 మిలియన్ మోతాదులు అందుబాటులో కి తీసుకు వస్తాము అన్ని అయినా చెప్పారు.

ఫార్మసీ నుండి కొనుగోలు చేస్తే ఒకే మోతాదు (రెండు ఈ దశలో సిఫార్సు చేయబడతాయి) ఎంఆర్‌పి కాస్ట్ ₹ 1,000 వరకు ఖర్చు అవుతుంది, ప్రైవేట్ మార్కెట్ కోసం ఇది సుమారు ₹ 500 లేదా 600 (పంపిణీదారునికి + ₹ 200)రూపాయిలు. అయితే ప్రభుత్వం 90 శాతం సరఫరాను మోతాదుకు ₹ 250 చొప్పున కొనుగోలు చేస్తుంది. ప్రైవేటు మార్కెట్‌కు విడుదల చేయాలని భావిస్తున్న 10 శాతం మార్చికి ముందు లభించే అవకాశం లేదని, టీకా పంపిణీని అప్పటి వరకు ప్రభుత్వ పరిరక్షణగా మార్చారని ఆయన అన్నారు. లైసెన్సింగ్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి సమయం అవసరం కాబట్టి ఆలస్యం జరుగుతుందని అనే విషయాన్ని వెల్లడించారు.

“అప్పటి వరకు సామాన్య ప్రజలకు సులభంగా లభించే అవకాశం లేదు. వారు ప్రభుత్వ పంపిణీ కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుంది మరియు అర్హత ఉంటే వారు దానిని పొందుతారు లేకపోతే వారు మార్చి వరకు వేచి చూడక తప్పదు అన్ని “మిస్టర్ పూనవల్లా చెప్పారు. బ్రిటన్,బ్రెజిల్‌లోని ట్రయల్స్ నుండి వచ్చిన డేటా ఆధారంగా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో సంయుక్తంగా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసిన ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, నెలకు రెండు మోతాదులకు పైగా ఉపయోగించినప్పుడు, ఇది 90 శాతం ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ట్రైల్స్ దశలో ఉన్న మేఘ్ట వ్యాక్సిన్ తో పోలిస్తే, ఈ టీకా సగటు సామర్థ్యం 70 శాతమని ప్రకటించింది. ప్రయోగ ఫలితం 90 శాతం ప్రభావవంతంగా ఉందని, 70 శాతం మందిలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఉందని తెలిపింది. దీనిని ఫ్రిజ్ ఉష్ణోగ్రత వద్ద కూడా రవాణా చేయవచ్చు అలాగే నిల్వ చేయవచ్చు, అన్ని ఆ సంస్థ తెలిపింది.