NewsOrbit
న్యూస్

బాలికలపై అత్యాచారం కేసు.. నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి లింగాయత్ మఠాధిపతి శివమూర్తి

మైనర్ బాలికల ను లైంగికంగా వేధించారన్న అభియోగంపై అరెస్టైన కర్ణాటకలోని ప్రముఖ లింగాయత్ మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును విచారించేందుకు గానూ నాలుగు రోజుల కస్టడీకి స్థానిక కోర్టు అనుమతి ఇచ్చింది. చిత్రదుర్గలోని ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి వీల్ చైర్ లో శివమూర్తి ని శుక్రవారం సాయంత్రం కోర్టుకు హజరుపర్చారు. అనారోగ్య కారణాలతో ఈ ఉదయం శివమూర్తి ఆసుపత్రిలో చేరారు. అయిదు రోజుల కస్టడీ విచారణకు పోలీసులు అభ్యర్ధించగాా కోర్టు నాలుగు రోజులు అనుమతి ఇచ్చింది. జైలు నుండి నిందితుడిని ఆసుపత్రికి తరలించిన సమాచారాన్ని ఇవ్వకపోవడంపై కోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసింది. జైలు అధికారులు నిందితుడికి సంబంధించి మెడికల్ రిపోర్టు అందజేయాలని ఆదేశించింది. పోలీసులు తమ కస్టడీలో నిందితుడికి వైద్య పరీక్షలు జరిపించాలనీ, ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారితే ఆసుపత్రికి తరలించాలని కోర్టు పేర్కొంది. ఈ కేసులో రష్మీని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

Karnataka lingayat (లింగాయత్) seer siva murthy
Karnataka lingayat లింగాయత్ seer siva murthy

 

ప్రముఖ లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరు పై లైంగిక వేదింపుల కేసు నమోదు కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఇది రాజకీయంగానూ తీవ్ర దుమారంగా మారింది. మఠం నడుపుతున్న పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యామని పోలీసులకు తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు రోజుల క్రితం ఆయనపై లైంగికవేధింపులు, ఫోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడంతో పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.

ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు గురువారం రాత్రి మఠానికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుని వెనుక డోర్ నుండి తీసుకువెళ్లారు. శాంతి భద్రతలను దృష్ట్యా పోలీసులు జాగ్రత్తలు పాటించారు. అనంతరం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు జరిపిన తరువాత జిల్లా సెషన్స్ జడ్జి ఇంటికి తీసుకువెళ్లి ఆమె ముందు హజరుపర్చారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించారు. అక్కడ నుండి ఆయనను జైలుకు తరలించారు. ఈ రోజు ఉదయం శివమూర్తి ఆరోగ్య పరిస్థితి దృష్యా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.

ఆ ఎన్నికలకు ‘సై’ అంటున్న టీడీపీ .. అభ్యర్ధులను ప్రకటించిన చంద్రబాబు

కాగా చిత్రదుర్గాలోని మురగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురగా శరణారావు (64)కు కర్ణాటకలోని లింగాయత్ కమ్యూనిటీలో మంచి పేరు ఉంది. ఎందరో ప్రముఖులు మురగ రాజేంద్ర మఠానికి వెళ్తుంటారు. కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీ ఈ మఠంలో శివదీక్ష తీసుకున్నారు. గతంలో అమిత్ షా, జేపి నడ్డా లాంటి ప్రముఖులు కూడా మాఠాన్ని సందర్శించారు. అయితే మురుగ మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థలో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న ఇద్దరు మైనర్ బాలికలు గత నెల 26న మైసూర్ లోని ఒ స్వచ్చంద సంస్థని ఆశ్రయించారు.

చాలా ఏళ్లుగా డాక్టర్ శివమూర్తి తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ బాలికలు ఆరోపించారు. ఆశీర్వాదం పేరుతో తమను ప్రతి వారం పిలిపించిన స్వామిజీ … తమ పై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలికలు ఆరోపించారు. సదరు స్వచ్చంద సంస్థ సహకారంతో బాధిత బాలికలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలికల్లో ఒకరు దళిత సామాజికవర్గానికి చెందిన బాలిక కావడంతో స్వామిజీ శివమూర్తిపై పోస్కోతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర సంచలనం అయ్యింది.

తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టులో ఊరట

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju