న్యూస్ సినిమా

ఆ హీరోతో నటిస్తే బాగోదు అంటూ కూతురికి డైరెక్టర్ శంకర్ వార్నింగ్..?

Share

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో నెపోటిజం అనేది బాగా ఎక్కువైపోయింది. ఏ ఇండస్ట్రీలో చూసినా స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్ల వారసులే ఎంట్రీలు ఇస్తున్నారు. అలానే చిత్ర పరిశ్రమలోనే శాశ్వతంగా పాతుకు పోతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా స్టార్స్ పిల్లలు ఒక రేంజ్‌లో ఇండస్ట్రీని ఏలుతున్నారు. 20 సంవత్సరాల క్రితమే దేశం మొత్తం గర్వించదగిన దర్శకుడిగా ప్రశంసలు పొందిన శంకర్ కుమార్తె అదితీ శంకర్ కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

శంకర్‌కి అది ఇష్టమే లేదు

అయితే శంకర్‌కి తన కూతుర్ని హీరోయిన్ చేయడం ఇష్టం లేదని చెబుతున్నారు. కానీ అదితి మాత్రం హీరోయిన్ అవుతానని పట్టుబట్టడంతో ఆయన ఒప్పుకోక తప్పలేదట. హీరోయిన్ మించిన మంచి అందంగా ఉండటంతో అదితి కోలీవుడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. ఈ అమ్మడు తన మొదటి సినిమా ‘విరుమాలై’లో హీరో కార్తీతో కలిసి రొమాన్స్ చేసింది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయింది కానీ హిట్ మాత్రం కాదు కాలేదు. అయినా కూడా ప్రేక్షకులకు అదితి నటన తెగ నచ్చేసింది. ఈ సినిమాలో ఆమె అందచందాలకు, నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమెకి ఫ్యూచర్‌లో గొప్ప హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని కూడా కామెంట్లు చేశారు. కాగా తన తొలి సినిమా ప్రమోషన్లలలో తండ్రి గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. హీరోయిన్‌గా తాను చేయడానికి తన తండ్రికి ఇష్టం లేదని అదితి చెప్పింది. అయితే తనకు ఇష్టం అని చెప్పడంతో తన తండ్రి కాదనలేకపోయాడని తెలిపింది. ఇందుకు ఒప్పుకున్నా కూడా ఒక హీరోతో మాత్రం నటించకూడదనే ఒక కండిషన్ పెట్టాడట.

ఆ హీరో ఎవరు?

శంకర్ తన కుమార్తెని హీరో శింబుతో నటించకూడదనే కండిషన్ పెట్టాడట. దీనికి కారణం ఏ హీరోయిన్ శింబుతో నటించినా అతడు ప్రేమ వ్యవహారం మొదలెడతాడు. అందుకే శంకర్ ముందు జాగ్రత్తగా తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి శింబుతో యాక్ట్ చేయవద్దని కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ విషయం గురించి గుసగుసలు ఎక్కువగా వినపడుతున్నాయి.


Share

Related posts

బాలయ్య సినిమాలో సరికొత్త మార్పులు.. అవి చూస్తే అభిమానులు షాక్ అవ్వడం ఖాయం!

Teja

Atchannaidu : అచ్చెన్నాయుడు అరస్ట్ జరిగిన 12 గంటలకే మరొక సంచలనం ??

somaraju sharma

అయోధ్య కేసులో 4గురికి జీవిత ఖైదు

somaraju sharma