Balakrishna: ఇండస్ట్రీలో ప్రస్తుతం సీనియర్ హీరోలు గా వ్యవహరిస్తున్న వారిలో బాలయ్య బాబు మంచి స్పీడ్ మీద సినిమాలు చేస్తున్నారు. తన తోటి హీరోలు చాలా లేటుగా సినిమాలు చేస్తున్నా గాని బాలయ్య బాబు మాత్రం కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న పరిస్థితి. అంతమాత్రమే కాకుండా ప్రస్తుత తరం సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్న వాటిని కూడా బద్దలు కొట్టేస్తున్నాడు.
రీసెంట్ గా బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న “అఖండ” సినిమా టీజర్ రిలీజ్ అయ్యి అతి తక్కువ టైమ్ లోనే ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఎక్కడ ఏ విషయంలో కూడా బాలయ్య బాబు తగ్గే ప్రసక్తి లేదు అన్న రీతిలో మంచి జోష్ మీద ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అటువంటి బాలయ్య బాబు తో అనేక యాక్షన్ సన్నివేశాలు ఫైట్లు చిత్రీకరించిన.. రామ్ లక్ష్మణ్ బ్రదర్స్.. ఆయన గురించి క్రేజీ కామెంట్ చేశారు. ఇటీవల వీరిద్దరు తమ పర్సనల్ లైఫ్ గురించి ఇంక ప్రొఫెషనల్ లైఫ్ గురించి అనేక విషయాలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు ప్రస్తావన రావటంతో .. రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ సంచలన కామెంట్ చేశారు.
ఇండస్ట్రీలో రిస్క్ అంటే ముందుకు వచ్చే హీరో ఎవరు అనే ప్రశ్న యాంకర్ నోట నుండి వచ్చిన వెంటనే ఏమీ ఆలోచించకుండా ఇద్దరూ ఒకేసారి బాలయ్యబాబు అంటూ ఠక్కున చెప్పేశారు. రిస్క్ యాక్షన్ సన్నివేశం అంటే చాలామంది స్టార్ హీరోలు వెనకాముందు ఆలోచిస్తారు. కానీ బాలయ్య బాబు మాత్రం .. యాక్షన్ సీన్ చెప్పటమే ఆలస్యం వెంటనే రంగంలోకి దిగి .. ఎటువంటి ఫైట్ అయినా.. పోరాటం సన్నివేశం అయినా.. బాలయ్య బాబు డేర్ అండ్ డాషింగ్ గా వచ్చి చెప్పింది చేసేసి వెళ్ళిపోతారు. గతంలో ఆయనతో సింహా లెజెండ్ సినిమాలో.. కలిసి పని చేయడం జరిగింది మంచి పేరు తీసుకొచ్చాయి అంటూ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ బాలయ్య బాబు పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం అఖండ సినిమా మాత్రమే కాక గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి కూడా బాలయ్య బాబుతో పని చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.