NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Feb4 Today Episode: అది జగతి అంటే… దేవయానికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిందిగా..?

Guppedentha Manasu Feb4 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో జగతి ఇచ్చిన డ్రెస్‌ని రిషికి అందించి తెలివిగా రెండు మాటలు తీసుకుంది. ఈ రోజు మొత్తం ఎలాంటి పరిస్థితులు వచ్చినా గాని మీరు కోపం తెచ్చుకోవద్దు’ అంటూ రెండు మాటలు తీసుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో అంతాకలిసి ఒకదగ్గర భోజనాలు చేస్తూ ఉంటారు. వసు వడ్డిస్తూ ఉంటుంది. ‘అమ్మావసుధరా నువ్వు కూర్చో’ అంటాడు ఫణేంద్ర.

AP Cabinet: తమ్మినేనికి స్థానం మార్పు.. కానీ..!? కొత్త మంత్రి/ స్పీకర్ ఎవరు..!?

Guppedentha Manasu Feb4 Today Episode: రిషి పక్కన కూర్చుని భోజనం చేస్తున్న వసుధారా:

ఫర్లేదు సార్ అని అన్ని వడ్డీస్తూ ఉంటుంది.దాంతో ‘గుడ్ వసుధరా ఇలా కలుపుగోలుగా ఉండటం అందరి వల్లా కాదు..’ అంటాడు మహేంద్ర.అవును అవును వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను తన కలుపుగోలుతనం అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని.వెంటనే రిషి.. ‘కూర్చో వసుధరా’ అంటూ తన పక్కనే సీట్ చూపిస్తాడు. దాంతో వెంటనే కూర్చుంటుంది దేవయాని రగిలిపోతుంది. ఇక గౌతమ్ నవ్వుతూ.. ‘పెదనాన్నా నాకు భలే గమ్మత్తుగా ఉంది తెలుసా జగతి మేడమ్ మన కాలేజ్ ప్రొఫెసర్‌లా వసుధర స్టూడెంట్‌లా అస్సలు అనిపించడం లేదు.

 Life : జీవితం లో ప్రశాంతత లేదని బాధ పడుతున్నారా ?
గౌతమ్ కు అసలు నిజం తెలిసిపోయిందా..?

జగతి మేడమ్ ఇంటి చుట్టంలానే అనిపిస్తున్నారు అంటాడు. దాంతో అంతా షాక్ అయినట్లు చూస్తారు దాంతో జగతి ఎలాగోలా కవర్ చేస్తుంది.ఇక గౌతమ్ రేయ్ రిషి అందరిలో ఎవరి డ్రెస్ బాగుందో చెప్పు అంటాడు.అందరినీ చూసి.. ‘పెద్దమ్మ డ్రెస్ బాగుంది..’ అంటూ దేవయానిని పొగుడుతాడు. అయితే గౌతమ్.. ‘నాకు అందరిలోనూ నీ డ్రెస్ బాగుంది’ అని పైకి అంటూ..మనసులో మాత్రం వసు డ్రెస్ బాగుంది అనుకుంటాడు.ఎవరి సెలెక్షన్‌రా అంటాడు గౌతమ్ రిషిని. దాంతో వసు ఇచ్చింది కాబట్టి.. కాస్త గర్వంగా ఫీల్ అవుతుంటాడు రిషి. ‘అది జగతి సెలెక్షన్..’ అంటుంది కావాలనే దేవయాని.

Virtues : మనం ఎందుకు ధర్మాలు  కలిగి ఉండాలో తెలుసా ??
జగతి బట్టలు ఇచ్చిందని రిషి కోపంతో. ఏమి. చేస్తాడంటే..?

తింటూ తింటూ ఉన్న రిషి చేతిలోని అన్నం ముద్దని కంచం వదిలిపెట్టి షాక్ అయిపోతాడు.కానీ వసుధరాకి ఇచ్చిన మాట గుర్తొచ్చి కోపాన్ని అనుచుకుంటాడు.కానీ దేవయాని మాత్రం షాక్ అవుతుంది. మిగిలిన అంతా ఊపిరి పీల్చుకుంటారు.జగతి మేడమ్ మీ సెలక్షన్ సూపర్.. రిషికేనా నాకు లేదా’ అంటాడు గౌతమ్ నవ్వుతూ.. ‘రేయ్ తిన్నాక ఈ డ్రెస్ నీకే ఇస్తాను ఏడవకు..’ అంటాడు రిషి కాస్త కోపంగా.. ‘వద్దులేరా బాబు.. ఇలాంటిది ఒకటి కొనివ్వు చాలు..’ అంటాడు గౌతమ్. ‘మ్మయ్యా రిషి సార్ ఏం అనలేదు.. కోప్పడతారేమో అనుకున్నాను..’ అని వసు, ‘రిషి ఈ రోజు ఏంటో కూల్‌గా కనిపిస్తున్నాడు? అని జగతి.. మనసులో అనుకుంటారు.సీన్ కట్ చేస్తే.. చీకటి పడిన తర్వాత మహేంద్ర, జగతి కలిసి మేడమీద మాట్లాడుకుంటూ ఉంటే.. వసు అక్కడికి వెళ్లి.. ‘మేడమ్.. ఆకాశ దీపం ఎగరేద్దామని వచ్చాను.. ఇందులో మీరు మహేంద్రసార్ బాగుండాలని కోరుకుని పైకి వదిలితే అక్కడ నక్షత్రాలు, దేవతలు ఆశీర్వదిస్తారు.
‘మేడమ్ మీరు వెళ్లండి.. నేను పిలుస్తాను అంటుంది.

దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి :

మహేంద్ర, జగతిలు చేతులు పట్టుకుని, మెట్లు ఎక్కుతూ మాట్లాడుకుంటూ వస్తారు. ఎదురుగా దేవయానిని చూసి.. మహేంద్ర, జగతిలు చేతులు వదిలేసుకుంటాడు. ‘మహేంద్రా మన ఇంట్లో ఓ కొత్త అబ్బాయి గౌతమ్ ఉన్నాడని మరిచిపోవద్దు. వదినా భయపడాల్సిన అవసరం మాకు లేదు.. ఎవరో ఏదో అనుకుంటారని కాదు.. రిషి మనసుకి కష్టం కలిగించొద్దు అని మాత్రమే ఓపిగ్గా ఉన్నాం మేము.. అంతే కానీ.. ఎవరికో భయపడి మాత్రం కాదు..గుడ్ నైట్ జగతీ..’ అని చెప్పి తన రూమ్‌కి వెళ్లిపోతాడు మహేంద్ర. వెంటనే జగతితో దేవయాని.. ‘మహేంద్ర సంగతి పక్కన పెట్టు.. నువ్వైనా కాస్త అదుపులో ఉండాలి కదా జగతి…’ అంటుంది వెటకారంగా మహేంద్ర నా భర్త తాళి కట్టిన భర్త..’ అంటుంది జగతి. ‘ఇదే అలసుగా తీసుకుని మహేంద్ర గదిలోకి వెళ్లి..’ అంటూ దేవయాని ఎదో అనబోతుంటే ‘అక్కయ్యా అసభ్యంగా మాట్లాడకండి.. మీరు హద్దుల్లో ఉంటే నేను మర్యాదగా ఉంటాను..ఇంతలో పెద్దమ్మా అంటూ ఎంట్రీ ఇచ్చాడు రిషి. రిషి మెట్ల మీద ఉండగానే.. జగతి చిన్నగా దేవయానితో.. ‘నా కొడుకు వచ్చాడు నేను ఇక్కడికి రావడం మీ పెద్దమ్మకి ఇష్టం లేదని చెప్పి చూడనా’ అంటుంది జగతి. దేవయాని చాలా కంగారు పడుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju