Harish shankar: రాం గోపాల్ వర్మ వేలు పెట్టకపోతే హరీశ్ శంకర్ అకౌంట్‌లో మరో బ్లాక్ బస్టర్ పడేది..!

Share

Harish shankar: సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఓ తెరిచిన పుస్తకం. అన్నీ పేజీలు అందరూ చదివేవారే. ఏరోజు కుదురుగా ఉండని వర్మ ఎప్పుడూ దేనిమీదో ఒకదాని మీద కలుగ చేసుకొని కామెంట్ చేసి హాట్ టాపిక్ అవుతుంటాడు. ఈ మధ్య కాలంలో ఆయన వెర్రి వెకిలి చేష్టలు మరీ ఎక్కువయ్యాయి. అమ్మాయిలంటే ఆయనకి ఉన్నంత క్రేజ్ మరొకరికి ఉండదేమో. శివ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా మారిన వర్మ ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో పాతుకుపోయాడు.

harish-shankar-missed one block buster due to ram gopal varma
harish-shankar-missed one block buster due to ram gopal varma

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో ఆయనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరచుకున్నాడు. అవసరం అయితే ఆయనే నిర్మాతగా మారి మనసుకు నచ్చిన సినిమాలు తీసుకుంటుంటాడు. వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ కాలం ఆయనతో ఉండలేరు. గట్టిగా రెండు మూడు సినిమాలు చేస్తే ఇద్దరిలో ఎవరికో ఒకరికి విసుగొచ్చి విడిపోతారు. అయితే వర్మ తన వద్ద అసోసియేట్స్‌గా పనిచేసిన చాలామందిని ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం చేసి లైఫ్ ఇచ్చాడు.

Harish shankar: హరీశ్ శంకర్, షాక్ కథ రాసుకొని వర్మకి వినిపించాడు.

కొన్ని సినిమాలకు దర్శకులు వారే అయినా అన్ని తానై అనేట్టుగా ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో వేలు పెట్టి పాడు చేస్తాడు కూడా. ఈ క్రమంలో సూపర్ హిట్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్‌గా అయిన సందర్భాలున్నాయి. అలాంటి ఓ సినిమానే షాక్. ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకుడు. అప్పటి వరకు రాం గోపాల్ వర్మ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన హరీశ్ శంకర్, షాక్ కథ రాసుకొని వర్మకి వినిపించాడు. కథ బావుందని మెచ్చుకున్న వర్మ ఆయన ఆధ్వర్యంలోనే సినిమాను రూపొందించేలా సన్నాహాలు చేశారు.

ఇందులో హీరోగా మాస్ మహారాజ రవితేజ – జ్యోతిక జంటగా నటించారు. సినిమా కథ, కథనం పరంగా చాలా బావుంటుంది. మేకింగ్ కూడా హరీశ్ శంకర్ బాగా చేశాడు. చాలామందికి షాక్ సినిమా నచ్చింది. అయితే ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ మాత్రం ఫ్లాప్. అందుకు కారణం పూర్తిగా రాం గోపాల్ వర్మనే. ఈ విషయం ఓపెన్‌గా అందరిముందు ఒప్పుకున్నాడు కూడా. ఓ ఇంటర్వ్యూలో మీ అసోసియేట్స్ సినిమాకి డైరెక్షన్‌లో వేలు పెడతారట కదా..అని అడిగితే..మేకింగ్ విషయంలో నాకు నచ్చనట్టుగా చేస్తే వేలు కాదు కాలు కూడా పెడతానని చెప్పుకొచ్చాడు.

Harish shankar: హరీశ్ శంకర్ సరిగ్గా తీయలేకపోయాడు.

ఆ రకంగా మంచి కథ, కథనం ఉన్న షాక్ సినిమాను వర్మ వేలు పెట్టి డైరెక్షన్‌లో మిగతా విషయాలలో ఆయన సలహాలు ఇవ్వడం వల్లే హరీశ్ శంకర్ సరిగ్గా తీయలేకపోయాడు. లేదంటే షాక్ సినిమా హరీశ్ శంకర్ ఖాతాలో తప్పకుండా బ్లాక్ బస్టర్‌గా నిలిచేది. ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ రవితేజతోనే మిరపాయ్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. మేకింగ్ పరంగా, మ్యూజిక్ పరంగా..అన్నీ విధాలుగా మిరపకాయ్ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిరపకాయ్ సినిమా తర్వాత హరీశ్ శంకర్‌కి టాలీవుడ్‌లో భారీ క్రేజ్ వచ్చింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీశ్ శంకర్ త్వరలో ఆయనతో మరో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. మైత్రీ మూవి మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.


Share

Related posts

Kidney: కిడ్నీ సమస్య ఉన్నపుడు ఆహారం లో వీటిని తీసుకోండి!!

Kumar

Digangana Suryavanshi Latest Pictures

Gallery Desk

Samantha Akkineni Beautiful Pics

Gallery Desk