కియారా అద్వానీ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది.. భరత్ అనే నేను సినిమా. ఈ సినిమాలో ఎంతో అభినయంతో నటించిన ఈ అమ్మడు అందంతో అందరిని ఆకట్టుకుంది. కానీ అంతకన్న ముందే తను నటించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో తను ఎంత బోల్డ్ అనేది చూపించింది. ఈ వెబ్ సిరీస్ లో స్వయం తృప్తి పొందే మహిళ పాత్రలో బోల్డ్ గా నటించింది ఈ హీరోయిన్. అయితే సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా అంతే బోల్డ్ గా సమాధానాలు ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఈ మధ్యలో జరిగిన ఒక చిట్ చాట్ లో సెక్స్ గురించి పలువురు అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు ఇచ్చింది. కియారా అద్వానీ సె** టాపిక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు గుక్కతిప్పుకోకుండా సమాధానం చెప్తూ.. అందరిని ఆశ్చర్య పరిచింది. అయితే ఈ మధ్య పలువురు హీరోయిన్లు బోల్డ్ సన్నివేశాల్లో నటించడం మాత్రమే కాదు. నిజ జీవితంలో కూడా బోల్డ్ గా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
ఇలాగే కియారా అద్వానీ కొన్ని బోల్డ్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సోషల్ మీడియాను తన వైపుకు తిప్పుకుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఇటీవలే జరిగిన ఒక చిట్ చాట్ లో.. ఒక నెటిజన్ అడుగుతూ.. మీకు సెక్స్ కంటే ఇష్టమైన మూడు విషయాల గురించి చెప్పమన్నాడు. దాంతో కియారా ఏ మాత్రం తడుముకోకుండా తనకు ఇష్టమైన వాటి గురించి తెలిపింది. ఇప్పుడు ఆ వీడియో అందరిని ఆకర్శిస్తుంది.
తనకు సెక్స్ కంటే పిజ్జా, షాపింగ్, సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టమని తెలివిగా సమాధానం చెప్పింది. లక్ష్మీ అనే హిందీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కియారా ఈ విధంగా మాట్లాడింది. ఈ చిత్రనికి ముందు లక్ష్మి బాంబ్ అనే పేరు పెట్టారు. దాంతో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఇక ఆ సినిమాకు లక్ష్మీ గా పేరు మార్చారు. ఈ చిత్రం తెలుగులో భారీ హిట్ కొట్టిన కాంచనకు రీమెక్ గా వస్తోంది. దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 9న ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతుంది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమాని చూడొచ్చు.