NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

‘ఆఖరి ‘దారి మూసేస్తే ఎలా ?

కరోనా వలన చని పోయిన వారి ‘అంత్యక్రియల’ కి శ్మశానాల లో ‘చోటు’ ఇవ్వక పోవడం అనేది విచారించ వలసిన విషయం.

‘వైరస్ ఏయే రూపాలలో మనుషులకు సోకుతుందో?’ అనే ఆందోళన అందరి లోనూ వుంది. దాంట్లో భాగంగానే అందరూ ఇలా చేస్తున్నారు. ఆ జాగ్రత్త అవసరమే కావొచ్చు.

‘దూరాన్ని పాటించడం’ అనే దాని కోసం ఇప్పుడు దాదాపుగా అన్ని దారులనూ మూసి వేసాం.
కానీ ఇది అలా మూసి వెయ్యడానికి వీలుకాని మనిషి చేరే ‘ఆఖరి దారి.’
ఈ దారిని ఇప్పుడు అన్ని చోట్లా అందరూ మూసి వేస్తున్నారు. ఇది ఏ మాత్రం సమంజసం కాదు సమర్థనీయం కాదు



శ్మశానాల లో వుండే ‘కాటి కాపరుల’ లాగా కొన్ని శ్మశానాల దగ్గర కొంత మంది ‘కరోనా కాపరులు’ తయారయ్యారు.

వారు వాటి దగ్గర వంతుల వారీగా కాపలాలు కాస్తున్నారు. శవాలు రాగానే అడ్డుకుంటున్నారు. గుంతలు తొవ్వడానికి వొచ్చిన జేసిబీ మిషన్లనీ, ప్రభత్వ ఉద్యోగుల్ని వెనక్కు పంపించి వేస్తున్నారు. వారితో ఘర్షణకు దిగుతున్నారు.

కరోనా మనకు రాదనే గ్యారంటీ ఏమీ లేదు. ఇవ్వాళ వేరే వాళ్లకు ఇవ్వని చోటు రేపు ‘అక్కడ’ మనకి ఎలా దక్కుతుంది?

సాధారణ పౌరుల విషయం పక్కన పెడితే;
రేపు కరోనాకి వైద్యం చేసిన ఒక డాక్టరు కో,
కాపలా కాస్తున్న పోలీసుకో, సేవలందిస్తున్న వైద్య సిబ్బందికో,
మునిసిపాలిటీ వారికో, రెవిన్యూ వారికో
కేవలం ఈ పనులు చేసినందు వల్లనే వైరస్ సోకి చనిపోతే; అప్పుడు వారి పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా ఇలానే చేస్తామా?

బ్రతికి వున్నప్పుడు వారి సేవలను అందుకొని, చని పోయాక అలా చేస్తే; అది ‘మానవ న్యాయం’ కిందకు వొస్తుందా? అది వారిని అవమానించడం కాదా?

మనుషులు బ్రతికి వున్నప్పుడు వారికి ఎలాంటి ‘మానవ హక్కులు’ వుంటాయో; చని పోయాక కూడా వారికి కొన్ని ‘మరణ హక్కులు’ ఉంటాయి. వాటిని గౌరవించాలి.

ఇవ్వాళ అవతల వారి మరణ హక్కుల్ని నిరాకరించే మనకు కూడా రేపు అలాంటి నిరాకరణేఎదురవుతుందni గుర్తించాలి.

‘కరోనా హతుల స్మశాన నిరాకరణ’ అనేది ఒక్క హక్కుల ఉల్లంఘనే కాదు; చట్ట వ్యతిరేకం కూడా అవుతుంది. అయితే; ఆ ఉల్లంఘన పౌరులుగా మనం చేయడమే కాకుండా ప్రభుత్వం కూడా చేయడం శోచనీయం.

‘అంటువ్యాధుల ప్రత్యేక నివారణా చట్టం’ తన చేతుల్లో ఉన్నంత మాత్రం చేత, దాని ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలను పంపడం బాధ్యతారాహిత్యం.

కరోనా పీడితుల శవాలను వారి సంబంధీకులకు ఇవ్వడమూ, కర్మ కాండలకు అనుమతి ఇవ్వడమూ అనేవి సాధ్యం కాక పోయినా

కనీసం ‘చివరి చూపుల’ వరకూ దూరంగా నైనా అనుమతి ఇచ్చి ఉండ వలసింది. అలాగే వారిని కూడా శ్మశానం వరకూ రానివ్వ వలసింది.

ఆ ప్రక్రియకు ఐన వాళ్ళను దూరం చేసి, దాన్ని ‘దూరాన్ని పాటించడం’ గా ప్రభుత్వాలు ఎప్పుడైతే మనకు నేర్పాయో; ఆ దూరం ‘స్మశాన దూరానికి’ కూడా దారి తీసింది .

కరోనా ఒక్క సారిగా పోయేది కాదు. పాజిటివ్ కేసులు పెరుగుతూనే వున్నాయి. దానికి తోడు మరణాలు కూడా పెరుగుతూనే వున్నాయి.

శవాలు తుమ్మవు. దగ్గవు. తుప్పర్లు పడేలా మాట్లాడవు. పూర్తిగా సానిటైజ్ తో పాక్ చేసి ఉంటాయి. రోడ్ల వెంట ఊరేగింపుగా రావు. కాబట్టి, భయం ఉండక పోవొచ్చు.

గాలి ద్వారా రావడానికి అవకాశాలు ఉన్నాయని కొంత మంది శాస్త్ర వేత్తలు అనుమానిస్తున్నప్పటికీ, తమ అభిప్రాయాలnu ‘ప్రపంచ ఆరోగ్య సంస్థకు’ విన్నవించినప్పటికీ, దానికి ఆమోద ముద్ర ఇంకా రాలేదు.

ఒక వేళ అది నిజమైనప్పటికీ అప్పుడది ఇంకెంత మాత్రమూ నిర్జీవ దేహాల సమస్య గా కాకుండా, సజీవ దేహాల ఉనికి సమస్య గా మారి, మొత్తం మానవ జాతి మనుగడే ప్రస్నార్ధకం గా మార వొచ్చు. అదంతా వేరే విషయం.

కానీ అప్పటి దాకా,
శవాలను శ్మశానాల లోనే పూడ్చాలి. (లేదా; కాల్చాలి.) అది తప్పదు. దానికి వేరే దారి లేదు.

దీని గురించి రాజకీయ నాయకులు, అధికారులు ఆయా ప్రాంత ప్రజలకు కౌన్సిలింగ్ చేసి; ఒప్పించాలి. ప్రజలు దీనికి సహకరించాలి. తప్పదు.

author avatar
Yandamuri

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!