పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీదే వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఆధారపడి ఉందని అందరు అనుకుంటున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. అందరికి తెలిసిన కరోనా కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు టాకీపార్ట్ కంప్లీటయిన ఈ సినిమా క్లైమాక్స్ కి సంబంధించిన కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ కి రావాలంటే ఆలోచించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ చిత్రీకరణ మొదలైందని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకుండా ఉన్న సీన్స్ ని కంప్లీట్ చేస్తున్నారట. ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ … దీక్ష ముగియడానికి మరికొంత సమయం ఉందట. దీక్షలో ఉన్న పవన్ జుట్టు, గడ్డం పెంచేశారు. కాగా త్వరలో వకీల్ సాబ్ కి కావల్సిన మేకోవర్ తో షూటింగ్ స్పాట్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ హిట్ సినిమా పింక్ కి రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతుండగా వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న్నాడు.
శృతి హాసన్ హీరోయిన్ గా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, సీనియర్ నరేష్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతమందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రానుందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మేకర్ బోనీకపూర్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ని ప్రకటించాడు పవర్ స్టార్. వరసగా 2021 లో ఈ సినిమాలన్ని రిలీజ్ అయ్యేలా పవర్ స్టార్ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.