NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ నెల 30లోగా రేషన్ కార్డు అప్డేట్ చేయకుంటే డిసెంబర్ నుంచి రేషన్ కట్..!

పేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు కేంద్రం అనేక రకాలుగా సాయపడుతోంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బియ్యం అందించడం. రేషన్ బియ్యం ద్వారా ఎంతో మంది కడుపులను నింపుతోంది ప్రభుత్వం. కాగా ఇంత మంచి పథకంలో ఎన్నో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. అక్రమ రవాణాలు ఇప్పటికీ తగ్గడం లేదు. ఇదీ అటుంచితే నకిలీ రేషన్ కార్డులతో మోసాలకు పాల్పడున్నారు కొందరు అక్రమార్కులు.

వీరి మోసాలను అరికట్టడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలా మోసాలకు పాల్పడిన 4.39 కోట్ల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేసి లబ్దిదారులకు ప్రయోజనం కలిగించేందుకు ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంచితే అసలైన లబ్దిదారులకు మేలు జరిగేందుకు నకిలీ రేషన్ కార్డులను రద్దు చేసి కొత్త రేషన్ కార్డులను తెచ్చేందుకు చర్యలను తీసుకుంటుంది. కాగా నకిలీ రేషన్ కార్డుల మూలంగా అనేక మంది అసలైన లబ్దిదారులు ప్రయోజనం పొందలేకపోతున్నారని తెలిపింది. అలాగే నకిలీ కార్డులు రద్దు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి అనేక చర్యలు తీసుకుంటుంది.

ఇదిలా ఉండే రేషన్ కార్డులు తమ ఆధార్ కార్డులతో అనుసంధానం లేకుండా ఉన్న వాటిని వెంటనే అనుసంధానం చేయాలని కేంద్రం సూచిస్తుంది. అలాగే రేషన్ కార్డులు, లబ్దిదారుల డేటాబేస్ డిజిటలైజేషన్ , డిజిలలైజ్డ్ సమాచారంలో నకిలీ డేటా తొలగించడం, మరణించిన వారి రేషన్ కార్డులను తొలగించడం వంటివి జరుగుతాయని తెలిపింది. కాగా 2013 నుంచి 2020 వరకు 4.39 కోట్ల నలికీ రేషన్ కార్డులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాయి. ఇదే కాకుండా ఎన్ఎఫ్ఎస్ఏ జారీ చేసిన కోటాకు సంబంధించిన అసలైన లబ్దిదారులను గుర్తించడానికి కూడా సంబంధిత రాష్ట్రాలు ప్రయాత్నాలను ముమ్మరం చేశాయి.

అయితే దీని కింద అసలైన లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుంది కేంద్రం. అలాగే ఇప్పటి వరకు ఉన్న రేషన్ దారుల్లో ఎవరిదైన అధార్ కార్డుతో రేషన్ అనుసంధానం చేయనట్టయితే ఆ రేషన్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. కొత్త వాటిని మరల పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోవడానికి ప్రభుత్వం నవంబర్ 30 వరకు చివరి అవకాశం కల్పిస్తుంది. ఈ తేదీ దాటిన తరువాత రేషన్ తో ఆధార్ కార్డును అనుసందానించని కార్డుదారులని సరుకులు పొందడంలో సమస్యలు రావచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే రేషన్ కూడా రద్దు అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !