Ananya pande : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ప్రస్తుతం పుష్ప సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా కలిసి 200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ లో పుష్ప 1 పూర్తి కానుండగా డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. దాంతో వెంటనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను సెట్స్ మీదకి తీసుకురానున్నారట. ఇందుకోసం అక్టోబర్ లేదా నవంబర్ లో ఐకాన్ మూవీకి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిటవుతున్న అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను 5 నెలల్లోనే పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇది పూర్తి చేసి మళ్ళీ పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నాడట. ఈ మేరకు ఇప్పటికే దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజుకు సూచించాడట. ఈ క్రమంలో ఐకాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఇదే నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు హీరోయిన్ వేట మొదలైందట.
Ananya pande : త్వరలోనే ఐకాన్ హీరోయిన్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
ఐకాన్ కూడా పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుండగా బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ స్టార్ ను హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం. సాహో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా కపూర్ నుంచి ప్రస్తుతం పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న అనన్య పాండే వరకు పలువురు క్రేజీ హీరోయిన్స్ ను ఐకాన్ ప్రాజెక్ట్ కోసం పరిశీలిస్తున్నారట దిల్ రాజు బృందం. కియారా అద్వానీని కూడా సంప్రదించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఐకాన్ హీరోయిన్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.