Keerthi suresh – nivetha thomas: కీర్తి సురేశ్, నివేతా థామస్ ..చెల్లి, కూతురు పాత్రలు చేస్తే కెరీర్ క్లోజ్ అంటున్నారు..మరి వీళ్ళ పరిస్థితేంటి..?

Share

Keerthi suresh – nivetha thomas: సినిమాలలో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న ఎవరు కూడా అంత త్వరగా హీరోలకి చెల్లిగా, కూతురుగా నటించడానికి అంగీకరించరు. ఇది బాలీవుడ్ కల్చర్. అక్కడ భారీ మల్టీస్టారర్స్ ఎప్పటి నుంచో తెరకెక్కుతున్నాయి. కాబట్టి అక్కడ స్టార్ హీరోయిన్స్ చెల్లిగా, కూతురుగా నటించినా సినిమాకి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ కాదు. కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి పాత్రలకి స్టార్ హీరోయిన్స్ ఒప్పుకుంటే ఇక హీరోయిన్స్ పాత్రలు తగ్గిపోయి అన్నీ చెల్లి, కూతురు పాత్రలే వస్తాయని చాలామంది అభిప్రాయపడుతుంటారు.

is keerthi-suresh-nivetha-thomas-career closed
is keerthi-suresh-nivetha-thomas-career closed

ఇప్పుడు టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ స్టార్ హీరోయిన్స్ కీర్తీ సురేశ్, నివేతా థామస్‌ల గురించి కూడా ఇలాంటి టాకే వినిపిస్తోంది. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ వీరిద్దరు చెల్లి, కూతురు పాత్రకి ఒప్పుకొని షాకిచ్చారు. నివేతా థామస్ యంగ్ హీరోలతో మంచి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజే సంపాదించుకుంది. తెలుగులో జెంటిల్ మేన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మంచి హిట్ అందుకుంది. నేచురల్ స్టార్ నాని సరసన నటించిన మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది.

ఆ తర్వాత జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా, నిన్నుకోరి లాంటి హిట్ సినిమాలు చేసింది. ఈ మధ్య చిన్న గ్యాప్ ఇచ్చిన నివేతా ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో వేముల పల్లవిగా నటించి బాగా ఆకట్టుకుంది. నివేతాకి నేచురల్ పర్ఫార్మెర్‌గా మంచి పేరుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు షాకిని ఢాకినీ అనే సినిమాలో కూడా నటించే అవకాశం అందుకుంది. అయితే నివేతా కెరీర్ నత్త నడకన సాగుతుందనే చెప్పాలి. ఆమె రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాలో ఆయనకి కూతురుగా నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో వరుస ప్రాజెక్ట్స్ అంటూ లేవు. పైగా సీనియర్ స్టార్ హీరోలకి కూతురు అంటే నివేతానే పరిశీలిస్తున్నారట.

Keerthi suresh – nivetha thomas: కీర్తి సురేశ్ అంటే చెల్లెలి పాత్రలకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని టాక్ మొదలైంది.

అలాగే కీర్తి సురేశ్ అంటే చెల్లెలి పాత్రలకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని టాక్ మొదలైంది. మహానటి సినిమాతో కీర్తి క్రేజ్ భారీ స్థాయిలో పెరిగింది. నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి సినిమాలతో పాటు మహానటి సినిమాలు చేసిన కీర్తికి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది. అయితే మహానటి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒప్పుకొని పెద్ద పొరపాటు చేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు కీర్తిని బాగా నిరాశపరచాయి. ఒక రకంగా ఆమె కెరీర్ కాస్త దెబ్బ తినింది ఈ సినిమాల వల్లే. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌కి చెల్లిగా అణ్ణాత్తా సినిమాలో నటించింది.

ఇదే ఒకరకంగా కీర్తికి అవకాశాలు తగ్గిస్తుందేమో అని అందరూ అనుకుంటుంటే..ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకి చెల్లిగా నటిస్తుందని మేకర్స్ చిరు – కీర్తి లుక్ రిలీజ్ చేసి అధికారకంగా ప్రకటించారు. సీనియర్ హీరోలకి స్టార్ హీరోయిన్స్ చెల్లిగా నటిస్తే కెరీర్ ఆశించినంతగా ముందుగు సాగదనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో కీర్తి సురేశ్ – నివేతా థామస్‌ల కెరీర్ ఎలా సాగుతుందో. ప్రస్తుతం కీర్తి సురేశ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


Share

Related posts

బెల్లి డాన్స్ వెనక ఇంతుందా?

Siva Prasad

Telangana CM KCR: కేసిఆర్ సంచలనం ..! గాంధీలో కోవిడ్ పేషంట్స్ పరామర్శ..!!

somaraju sharma

బిగ్ బాస్ స్టేజి పై పంచ్ ల వర్షం కురిపించిన హైపర్ ఆది! వామ్మో ఎవరినీ వదల్లేదు..!

arun kanna