NewsOrbit
Featured న్యూస్ సినిమా

Neha sharma: తెలుగులో సక్సెస్ కాలేకపోయిన పూరి హీరోయిన్..ఇప్పుడు అలా ఎంత ట్రై చేసినా ..?

Neha sharma: టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ ఉన్న దర్శకుడు పూరి జగన్నాధ్. ఆయన సినిమాలలో హీరోయిన్స్ ఎంతగా హైలెట్ అవుతారో అందరికీ తెలిసిందే. పర్ఫార్మెన్స్ పరంగా, గ్లామర్ పరంగా అటు ప్రేక్షకులలో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో భారీ స్థాయిలో పాపులారిటీ వచ్చేస్తుంది. కేవలం పూరి పరిచయం చేసిన హీరోయిన్‌కి గ్లామర్ హీరోయిన్‌గా మాత్రమే కాదు ఫ్యామిలీ హీరోయిన్ అనే పేరు కూడా బాగా వస్తుంది. అందుకు ఉదాహరణ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయిన ఆసిన్.

is neha-sharma-could not get success in tollywood
is neha sharma could not get success in tollywood

ఈమె తెలుగులో అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి తర్వాత శివమణి, లక్ష్మీ నరసింహా, ఘర్షణ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఇక టాలీవుడ్‌ను ఏలిన అనుష్క షెట్టి కూడా పూరి జగన్నాధ్ పరిచయం చేసిన హీరోయిన్ అని తెలిసిందే. ఆమె హీరోయిన్‌గా ఏ రేంజ్ స్టార్ డం సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన రక్షిత, ఆ తర్వాత పూరి డైరెక్షన్‌లోనే శివమణి, ఆంధ్రావాలా, పెళ్ళాం ఊరెళితే, అందరివాడు లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.

Neha sharma: ఆమెకు తెలుగులో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా.

బాలీవుడ్‌లో వెలుగుతున్న దిశా పఠాని లాంటి వారు మాత్రం తెలుగులో సక్సెస్ కాలేకపోయారు. పూరి పరిచయం చేయకపోయినా ఆయన డైరెక్షన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో నటించి సౌత్‌లో మంచి స్టార్ డం తెచ్చుకున్న ఇలియానా, తమన్నా లాంటి వారున్నారు. అయితే పూరి ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారిలో అడ్రస్ లేకుండా పోయినవారూ ఉన్నారు. అమీషా పటేల్ బద్రి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఆ తర్వాత అమీషా నటించిన నరసింహుడు, నానీ సినిమాలు మెప్పించలేకపోయాయి.

తనూరాయ్, బాచి సినిమాతో పరిచయమయిన నీలాంబరి, నేహ శర్మ, నేనింతే సినిమాతో పరిచయమైన శియా గౌతం లాంటి వారు అసలు అడ్రస్ లేకుండా పోయారు. శియా నేనింతే తర్వాత వేదం సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు. బాచి సినిమాలో జగపతి బాబు సరసన నటించిన నీలాంబరి పరిస్థితి అంతే. ఆమెకు తెలుగులో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా. తనూరాయ్ అలాగే ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాలో నటించిన మరో హీరోయిన్ కూడా మళ్ళీ కనిపించలేదు.

Neha sharma: నేహ శర్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

వీరందరికంటే నేహ శర్మ మీద అందరూ మంచి అంచనాలు పెట్టుకున్నారు. మెగా హీరో రాం చరణ్ డెబ్యూ సినిమా హీరోయిన్ కాబట్టి యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత అమ్మడు తెలుగులో చేసింది వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు అనే ఒకే ఒక్క సినిమా. ఆ తర్వాత నేహ మళ్ళీ అడ్రస్ లేదు. చెప్పాలంటే ఈ బ్యూటీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది. కానీ మేకర్సే ఆమెను పట్టించుకోవడం లేదు.

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri