NewsOrbit
న్యూస్

Rice: బియ్యం  నానబెట్టకుండా వండుతున్నారా?? అయితే ఇది తెలుసుకోండి !!

Rice: ఇది వరకు అన్నం వండే పద్ధతులు ఇప్పటి పద్ధతులకు చాలా తేడా వచ్చింది.. ఇప్పుడు అందరూ   బియ్యం  కడిగేసామా , కుక్కర్లో లేదా  ఓవెన్  పెట్టేసాం వాటి టైం అవగానే ఆఫ్ చేశామా  అని మాత్రమే ఆలోచిస్తున్నారు.అయితే వీటిలో పోషకాలు  ఎంత వరకు నిలిచి ఉంటున్నాయో ఎవరు ఆలోచించడం లేదు ..   మన అమ్మ అమ్మమ్మ  కాలంలో అన్నం  వండాలి అని అనుకున్నప్పుడు ముందు బియ్యం శుభ్రంగా కడిగి కాసేపు  నానబెట్టుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో   ఉడికించి, గంజి వార్చి వండేవారు.

ఆ  పద్ధతికి ఇప్పటి కుక్కర్లు, మైక్రో వేవ్స్, ఓవెన్ లో వండుకునే  పద్ధతి కి  తేడాలేంటి? అనేది తెలుసుకుందాం.  వండే ముందు బియ్యాన్ని కాసేపు నానబెట్టడం వల్ల చాలా  ఆరోగ్య ప్రయోజనాలు  పొందవచ్చు అని   ప్రముఖ పోషకాహార నిపుణులు  తెలియచేస్తున్నారు. అన్నం  వండే  ముందు బియ్యం నానడం వల్ల  వాటిలోని పోషకాలు  పెరుగుతాయి. అంతేకాదు ప్రేగు,జీర్ణాశయం, అన్నం లోని విటమిన్లు, ఖనిజాలు బాగా    అందుతాయి . బియ్యం నానబెట్టుకోవడం వలన త్వరగా  ఉడకడం తో పాటు  బియ్యంలో ఉండే  మంచి వాసనను బయటికి వచ్చేలా చేస్తుంది.   అన్నం  వండేటప్పుడు  బియ్యం కడగడం, నానబెట్టడం అనేవి  ఒక ముఖ్యమైన  అంశాలు .ఎందుకంటే ఇది బియ్యంలోని అవసరం లేని  వాటిని   బయటకు పంపి  బియ్యాన్ని మృదువుగా చేయడం తో పాటు అన్నం మెత్తగా అయ్యేలా చేస్తుంది.

బియ్యంను నానబెట్టడం వల్ల వంట  త్వరగా ముగిసిపోతుంది.   బియ్యం నాన బెట్టడం వలన నీటిని  పీల్చుకుని వేడి తగిలిన వెంటనే  ఉడికిపోతుంది.    జింక్, ఇనుము లోపం ఉన్నవారు  బియ్యాన్ని   నానబెట్టి వండుకుంటే మంచి ఫలితం ఉంటుంది.   బియ్యం ఎంతసేపు నానబెట్టాలి  అనే విషయం మీద జరిగిన అధ్యయనం ప్రకారం, బ్లాక్ రైస్,బ్రౌన్ రైస్, రెడ్ రైస్, పాలిష్ చేయని బియ్యాన్ని 6 గంటల నుంచి 12 గంటలు నానబెట్టుకోవాలి.  పాలిష్ చేసిన బ్రౌన్ రైస్ అయితే మాత్రం  4 నుంచి 6 గంటల వరకు  నానబెట్టుకోవాలి. ఒకవేళ బియ్యం అంటుకుపోతున్నటు ఉన్నట్లయితే     రాత్రి  అంతా    నానబెట్టుకోవాలి.  అదే   బాస్మతి రైస్ ,  సుషీ,జాస్మిన్  రైస్ లు అయితే  15 నుంచి 20 నిమిషాల వరకు నానబెడితే చాలు .

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !