కేసీఆర్ త‌ర్వాత జ‌గ‌నే… బీజేపీ ప్లాన్ ఏంటో తెలుసా?

Share

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్లతో పాటు.. తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కొనసాగారు.

 

48 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు దుమ్మురేపారు. బీజేపీ ఈ స్థాయిలో పుంజుకోవ‌డం పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపింది. అదే స‌మ‌యంలో ఈ తీర్పు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చింది. అదే స‌మ‌యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ గురించి కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది.

గ్రేట‌ర్‌లో ఏం జరిగింది?

అనూహ్య రీతిలో బీజేపీ పుంజుకుంది. మేయ‌ర్ సీట్ త‌మ‌దేన‌ని బీజేపీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఆ స్థాయిలో విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ అనూహ్యంగా టీఆర్ఎస్‌కు దాదాపు స‌మాన స్థాయికి చేరుకుంది. అదే స‌మ‌యంలో టీఆర్ఎస్ బ‌లం పెద్ద ఎత్తున త‌గ్గిపోయింది. ఇది ఓ వైపు టీఆర్ఎస్ పార్టీకి షాక్ అంటూనే బీజేపీ బ‌ల‌ప‌డేందుకు ఉన్న అవ‌కాశాన్ని స్ప‌ష్టం చేస్తుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు బీజేపీ ముఖ్య నేత‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఏపీ బీజేపీ కొత్త క‌లలు

గ్రేట‌ర్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆశించిన విజ‌యం సాధించ‌ని నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త స‌మీక‌ర‌ణాలు వేస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి బైరెడ్డి శబరి మీడియాతో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు తెలంగాణలో టీఆర్ఎస్ కి పట్టినగతే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి పడుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా బీజేపీ ముందుంటుందని కచ్చితంగా న్యాయం కోసం పోరాడుతామని బైరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీ అలాగే ప్రతి చోట కూడా లోకల్ నాయకులతో సహా అందరూ వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, ఆలయలలో టికెట్లు పెట్టి వ్యాపారం చేస్తున్నారని, ఇప్పటికే శ్రీశైలంలో జరిగిన అవినీతికి పాల్పడ్డ వాళ్ళను సస్పెండ్ చేశారని బైరెడ్డి శబరి గుర్తు చేశారు. మొన్నటి తుంగభద్ర పుష్కారాలకు కనీసం హిందువులకు స్నానాలు కూడా చేయనియకుండా అరెస్టులు చేశారు, ఓంకారం దేవాలయ పూజారుల దాడి విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మాట్లాడకపోడం బాధాకరం అన్నారు బైరెడ్డి శబరి .

 


Share

Related posts

Coniferous Plant: ఈ పూలు పూజ కే కాదు.. అందానికి కూడా..!!

bharani jella

జగన్ కి.., రాష్ట్రానికీ.. పోల”వరమా”..? శాపమా..!?

Srinivas Manem

కరోనా ద్వారా డబ్బులు సంపాదిస్తున్న స్టూడెంట్స్..!!

sekhar