హీరోయిన్ గా రాణించాలంటే ఖచ్చితంగా అందంగా ఉండాలి. అందంగా ఉండటం అనేది ప్రైమరీ. ఆ తర్వాత నటన, ఫిజిక్ లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే.. అందంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. ఆ అందానికి ఇంకాస్త మెరుగులు దిద్ది మేకప్ వేస్తే.. ఆ అందం రెట్టింపు అవుతుంది.
హీరోయిన్లు అయితే ఎప్పుడూ మేకప్ తోనే మనకు కనిపిస్తుంటారు. సినిమాల్లో మేకప్ తోనే కనిపిస్తారు.. సినిమా బయట ఎక్కడ చూసినా మేకప్ తోనే. మేకప్ లేకుండా వాళ్లు ఎలా ఉంటారో ఊహించుకోవడం కూడా కష్టమే.
తాజాగా.. మేకప్ లేకుండా ఉన్న ఫోటోను బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.
వచ్చే ఐదు నెలల్లో మరింత బలవంతులం కాబోతున్నాం.. అంటూ క్యాప్షన్ పెట్టి మరీ.. తన మేకప్ లెస్ ఫోటోను షేర్ చేసింది కరీనా.
ఇప్పటికే తైమూర్ అనే కొడకు సైఫీనాకు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కరీనా గర్భం దాల్చిందని తెలుస్తోంది. అందుకే మరో ఐదు నెల్లలో.. అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఇక.. ఈ ఫోటోను కరీనా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిందో లేదో ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కొందరు హీరోయిన్లను మేకప్ లేకుండా చూడలేం. కానీ.. కరీనా మాత్రం మేకప్ లేకున్నా ఎంతో అందంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/p/CF3vBjypssW/